Telugu News » హనుమాన్ సినిమాను చిరంజీవి “అంజి” సినిమా నుంచి కాపీ చేశారా? ప్రశాంత్ వర్మ ఇలా దొరికిపోయాడేంటి?

హనుమాన్ సినిమాను చిరంజీవి “అంజి” సినిమా నుంచి కాపీ చేశారా? ప్రశాంత్ వర్మ ఇలా దొరికిపోయాడేంటి?

by Sri Lakshmi

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా మారు మ్రోగి పోతోంది. హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాను అద్భుతంగ డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మకు కూడా మంచి పేరు వచ్చింది. హనుమాన్ సినిమాలో తేజ సజ్జ, అమృత అయ్యర్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఓ సూపర్ హీరో సినిమాగా రూపొందింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన హనుమాన్ సినిమా రికార్డుల పరంగా దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల అయిన మిగతా సినిమాల కలెక్షన్ ఒకెత్తు, హనుమాన్ సినిమా కలెక్షన్ మరొక ఎత్తు అన్నట్లుగా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఓ సామాన్యుడికి హనుమంతుడు పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? అన్నా పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. కథ, కధనం అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.

అయితే.. ఈ సినిమా చిరంజీవి అంజి సినిమాను చూసి కాపీ చేసారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. హనుమాన్ సినిమాలో హనుమంతుగా నటించిన తేజకు ఓ మణి దొరుకుతుంది. ఆ మణిని తీసుకోవడం వల్లే అతనికి హనుమంతుని శక్తులు వస్తాయి. దాని కోసం విలన్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తాడు. హనుమంతుని శక్తులను పొంది తానే అందరిని శాసించాలి అన్న ఆలోచన ఉన్న విలన్ ని హీరో, హనుమంతుని శక్తులు అడ్డుకుంటాయి.

ఇదే కాన్సెప్ట్ అంజి సినిమాలో కూడా కనిపిస్తుంది. హీరో అంజి కూడా ఫారెస్ట్ లోనే ఉంటాడు. అక్కడ శివుడి ఆత్మలింగం శక్తీ ఉంటుంది. ఫారెస్ట్ లో ఉండే హీరోను కొట్టి లోయలో పడేస్తారు. ఆ లోయలోని చిరంజీవికి ఆత్మలింగం కనిపిస్తుంది. ఆ ఆత్మలింగాన్ని తాకితే శివుడి శక్తులు వస్తాయి. అలానే చిరుకు కూడా ఆ ఆత్మలింగాన్ని తాకగానే శివుడి శక్తులు వచ్చి అతని దెబ్బలన్నీ మాయం అవుతాయి. ప్రణవ శివరాత్రి రోజు ఆ ఆత్మలింగం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ టైం లో దాన్ని పట్టుకుంటే ఆ శక్తులు మనుషులకూ వస్తాయి. అలా చిరుకి కూడా శక్తీ వస్తుంది. ఆ ఆత్మలింగం కోసం విలన్ వస్తాడు. చిరంజీవి కూడా విలన్ పై పోరాటం చేసి ఆ ఆత్మలింగాన్ని పూజిస్తాడు. హనుమాన్ సినిమాలో కూడా ఇలాంటి సీన్స్ కనిపించడంతో.. ఈ సినిమాను అంజి నుంచి కాపీ చేసారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment