ఇండస్ట్రీ అన్నాక లాభాలు ఎంత బాగా వస్తాయో ఒక్కోసారి నష్టాలూ కూడా అలానే వస్తాయి. కోట్లలో కలెక్షన్స్ చూసిన రోజు దాటితే కోట్లలో నష్టాలూ కూడా చూడాల్సి వస్తాము. సినిమాను బట్టి ఫలితాలు కూడా తారుమారు అవుతూ వస్తాయి. ఒక్కోసారి కొన్ని సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యి ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు రోడ్డున పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. సినిమాల వలన నష్టపోయి ఇండస్ట్రీ కి దూరం అయినా సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. కానీ కొందరు మాత్రం తిరిగి నిలదొక్కుకుని ఇండస్ట్రీలోనే నిలబడ్డారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న పూరి జగన్నాధ్ కూడా ఒకప్పుడు బాగా నష్టపోయారు. దానికి తోడు అయినా వారు మోసం చేయడంతో అనుకోని విధంగా అప్పులపాలయ్యి చివరకి రెంట్ హౌస్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే పూరి జగన్నాధ్ ధైర్యం కోల్పోలేదు. మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తిరిగి హిట్స్ కొట్టి నిలదొక్కుకున్నారు. జగదేక వీరుడు, సీతారామం, మహానటి వంటి సినిమాలతో లాభాలు పొందిన ప్రొడ్యూసర్ అనిల్ దత్ ఒకప్పుడు శక్తీ సినిమా తీసి దారుణంగా నష్టపోయారు. ఎనిమిదేళ్ల పాటు ఇండస్ట్రీ కి దూరం అయినా ఆయన ఇప్పుడు నిలదొక్కుకుని ప్రభాస్ తో ఓ సినిమా చేయనున్నారు.
రామ్ చరణ్ నటించిన ఆరంజ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నాగబాబు కూడా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆర్ధికంగా నష్టపోయారు. అలా అని ఆయన అక్కడితో ఆగిపోలేదు. సినిమాల్లోకి నటుడుగా రీ ఎంట్రీ ఇచ్చి ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. ఇలా వీరిలానే ఇండస్ట్రీలో సినిమాలు తీయడం వలన ఆర్ధికంగా నష్టపోయి తిరిగి నిలదొక్కుకున్న వారు చాలా మందే ఉన్నారు.