సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం కామన్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు నటీనటులు మాత్రమే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, గొడవలు జరిగినా తమ రిలేషన్‌ను బ్రేక్ చేసుకోకుండా కలిసి ఉంటున్నారు. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రేమ వివాహాలు పెళ్లివరకు వచ్చినా ఆ తర్వాత కొంత కాలానికే పెటాకులు అవుతున్నాయి.
అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడాకులు తీసుకుని మళ్లి పెళ్లి చేసుకుంటే వివాహ వ్యవస్థ మీద కొందరికి నమ్మకం పోయే అవకాశం లేకపోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.
ఈ మధ్య హీరోహీరోయిన్లే కాకుండా వారి సంతానం కూడా రెండు పెళ్లిళ్ల సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అందులో ముందుగా వినిపించే పేర్లు మెగా ఫ్యామిలీలో చిరంజీవి చిన్నకూతురు శ్రీజ..ఈమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయింది. మరోసారి పెళ్లికి సిద్ధమైనట్లు టాక్. ఇక ఈ మధ్యే నాగబాబు కూతురు కూడా పెళ్లి చేసుకుని విడిపోయి ఒంటరిగా ఉంటోంది.
ఈ క్రమంలోనే తమిళ, తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితుడైన హీరో సిద్ధార్థ్(HERO SIDDARTH) గుట్టుచప్పుడు కాకుండా హీరోయిన్ అదితిరావ్ హైదరీ(ADITHI RAO HAIDARI)ని రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం వనపర్తి జిల్లాలోని శ్రీరంగపరం ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్ అదితిని పెళ్లాడినట్లు(LOVE MARRIAGE) తెలిసింది. ఈ పెళ్లి గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, అదితి వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో ఒకరు. మహాసముద్రం మూవీ షూటింగ్ టైంలో అదితి, సిద్ధార్థ్ ఒకరినొకరు ప్రేమించుకునట్లు టాక్. గతంలో వీరిద్దరూ వేరేవాళ్లను పెళ్లాడారు. వారి నుంచి విడాకులు తీసుకుని ఇప్పుడు ఒక్కటయ్యారు.