Telugu News » ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురిని తీసుకొస్తే? ప్రశాంత్ వర్మ అప్ కమింగ్ సినిమాల హింట్స్ కి అరుపులే!

ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురిని తీసుకొస్తే? ప్రశాంత్ వర్మ అప్ కమింగ్ సినిమాల హింట్స్ కి అరుపులే!

ఇద్దరు కాదు.. ప్రశాంత్ వర్మ ఏకంగా ఏడుగురిని తీసుకొస్తే?

by Sri Lakshmi
hanuman

ప్రస్తుతం ఏ నోట విన్నా హనుమాన్ గురించే వినిపిస్తోంది. ఈ సినిమా చిన్నా, పెద్ద తేడా లేకుండా అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయిపొయింది. హనుమంతుడు చిరంజీవి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన ఎలా చిరంజీవి అయ్యాడో కూడా మనకు తెలుసు. చిన్నతనంలో సూర్యుడిని పండు అనుకుని హనుమంతుడు మింగేస్తే లోకాలన్నీ అల్లకల్లోలం అయ్యాయి. అయితే సూర్యుడ్ని బయటకు తీసుకురావడానికి ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడి దవడపై దాడి చేస్తాడు. దీనితో హనుమంతుడు మూర్చబోతాడు. కోపం తెచ్చుకున్న హనుమంతుడి తండ్రి వాయుదేవుడు గాలిని స్తంభింపచేస్తాడు. దీనితో బ్రహ్మ దేవుడు, ఇంద్రాది దేవతలు దిగి వస్తారు. వచ్చి హనుమంతుడిని చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తాడు. అప్పుడు గాని వాయుదేవుడు శాంతించి తిరిగి యధాస్థానానికి వస్తాడు.

అలా హనుమంతుడు వర ప్రభావంతో చిరంజీవి అయ్యాడు. అలా వరం వల్లనో, శాపం వల్లనో లోకంలో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. రామాయణంలో రావణాసురుడి తమ్ముడు విభీషణుడు ధర్మంవైపే నిలబడతాడు. అతని వ్యక్తిత్వాన్ని మెచ్చి రాముడు చిరంజీవిగా ఉండమని వరమిస్తాడు. ఈ ఇద్దరు చిరంజీవులు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో చూపించారు. వీరిద్దరూ కాకుండా మరో ఐదుగురు కూడా ఉన్నారు. జమదగ్ని కుమారుడు పరశు రాముడు కూడా చిరంజీవే. ఈయన కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నాడని.. కల్కి అవతారానికి కూడా ఈయనే గురువుగా ఉంటారని చెబుతుంటారు.

ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ కూడా చిరంజీవే. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని ఉపసంహరించడం తెలియక దాన్ని ఉత్తర గర్భంపై ప్రయోగిస్తాడు. ఫలితంగా గర్భంలోని ఇసువు చనిపోతుంది. దీనితో కృష్ణుడి కోపించి కలియుగాంతం వరకూ కుష్ఠు రోగిగా అడవులు తిరుగుతూ ఉండమని శాపం ఇస్తాడు. ఈ శాపవశాత్తూ అశ్వత్థామ కూడా చిరంజీవిగా మిగిలిపోతాడు. అసురుల రాక్షసుడు బలి చక్రవర్తి కూడా విష్ణువు ఇచ్చిన వరం వాళ్ళ చిరంజీవిగా ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున న్యాయంగా పోరాడిన కృపాచార్యుడు, మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు కూడా చిరంజీవిగానే ఉంటారు. అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన రాబోయే సినిమాటిక్ యూనివర్స్ లో ఇతిహాసాల నుంచి పాత్రలను తీసుకుంటాను అంటూ హింట్ ఇచ్చారు. ఇద్దరిని చూపిస్తేనే హనుమాన్ సినిమా వీర లెవెల్ లో హిట్ అయ్యింది. ఇక వీరంతా వస్తే.. సినిమా రేంజ్ మారిపోతుందని చెప్పొచ్చు.

You may also like

Leave a Comment