Telugu News » Nayanthara: విఘ్నేశ్ శివన్‌ను అన్‌ఫాలో చేసిన నయనతార..!

Nayanthara: విఘ్నేశ్ శివన్‌ను అన్‌ఫాలో చేసిన నయనతార..!

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లోకి అడుగుపెట్టారు. తాజాగా నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌(Vignesh Sivan)ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు. అయితే. ఈ మ్యాటర్ కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

by Mano
Nayanthara: Nayanthara unfollowed Vignesh Sivan..!

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లోకి అడుగుపెట్టారు. వారి పిల్లలను చూపిస్తూ తొలిపోస్ట్ పెట్టగా.. దానికి లక్షల మంది అభిమానులు లైక్‌లు, కామెంట్లు చేశారు. తాజాగా నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌(Vignesh Sivan)ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు. అయితే. ఈ మ్యాటర్ కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Nayanthara: Nayanthara unfollowed Vignesh Sivan..!

స్టార్ హీరోయిన్ నయనతారకు ఇన్‌స్టాలో 78లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, తన భర్త విఘ్నేశ్ శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. త్వరలో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ ఏడేళ్లపాటూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో 2022జూన్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక నయన్ సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘జవాన్’తో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్. మాధవన్, సిద్దార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో నయన్ ‘కుముద’ అనే పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ పాత్ర గురించి నయనతార మాట్లాడుతూ.. ‘కుముద… నా జీవితంలోకి ఓ పాత్రలా వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ పాత్రను ఇంత అందంగా తీర్చిదిద్దిన దర్శకుడు శశి, కుముదకు అండగా నిలిచిన మాధవన్, స్ఫూర్తినిచ్చిన సిద్ధార్థ్ అందరికీ చాలా థాంక్యూ. ‘టెస్ట్’ ద్వారా మా
ప్రేమను చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అని తెలిపారు.

You may also like

Leave a Comment