Telugu News » ఇదెక్కడి డ్రెస్ కీర్తి సురేష్.. బెడ్ షీట్ తెచ్చి చుట్టేసుకున్నావా అంటూ?

ఇదెక్కడి డ్రెస్ కీర్తి సురేష్.. బెడ్ షీట్ తెచ్చి చుట్టేసుకున్నావా అంటూ?

కీర్తి సురేష్ డ్రెస్ పై కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్!

by Sri Lakshmi

మహానటి సినిమాతో జాతీయ నటి పురస్కారాన్ని అందుకుని తెలుగు వాళ్ళ హృదయాలను కొల్లగొట్టిన నటి కీర్తి సురేష్. తెలుగు నాట సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ దసరా సినిమాతో బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని హీరోగా నటించారు. ఆ తరువాత చిరంజీవి హీరో గా నటించిన భోళాశంకర్ లో నటించింది. మెహర్ రమేష్ హీరోగా దర్శకత్వం వహించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా సంగతి తెలిసిందే.

అయితే… సినిమాలు చేతిలో లేకున్నా కీర్తి సురేష్ తన అభిమానులతో టచ్ లో ఉన్నారు. నిత్యం తన ఫోటోలను, లేటెస్ట్ అప్ డేట్స్ ను ఆమె ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కీర్తి సురేష్ కొన్ని ఫోటోలను అప్ లోడ్ చేసారు. ఈ ఫోటోలలో కీర్తి వేసుకున్న డ్రెస్ వెరైటీగా ఉంది. దీనిపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది? బెడ్ షీట్ ను తెచ్చుకుని చుట్టేసుకున్నావా కీర్తి? అంటూ పలువురు ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం, కీర్తి సురేష్ ఉన్నట్లుండి వెబ్ సిరీస్ ల వైపు గాలి మళ్లించారు. ఆమె ఓ వెబ్ సిరీస్ కు రీసెంట్ గానే సైన్ చేసారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ హిందీ నిర్మాత ఆదిత్యా చోప్రా నిర్మాణ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మరో కీలక పాత్రలో రాధికా ఆప్టే కూడా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు “అక్క” అని పేరు పెట్టారు. ఈ విషయం తెలియడంతో.. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం వల్లే కీర్తి సురేష్ వెబ్ సిరీస్ వైపు అడుగులేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment