టీమిండియా స్టార్ బౌలర్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ఓ నటి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ మూవీతో తమన్నాకు ఫ్రెండ్‌గా నటించిన బ్యూటీ పాయల్ ఘోష్(Payal Ghosh).. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ నటి ప్రస్తుతం బాలీవుడ్‌లో సెటిల్ అయిపోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు సంచలన పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవల బాలకృష్ణను చూసి బాలీవుడ్ హీరోలు నేర్చుకోవాలని పోస్ట్ పెట్టి విమర్శలకు గురైంది. తాజాగా, ఈ అమ్మడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammaed Shami)కి ట్విట్టర్(X) వేదికగా ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చింది. అందుకు కొన్ని కండీషన్లనూ పెట్టింది. ‘షమీ.. నువ్వు ఇంగ్లీష్‌ను మెరుగుపరుచుకో.. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ రాసుకొచ్చింది.
మరో పోస్టులో పాయల్.. ‘మహ్మద్ షమీ.. సెమీ ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి తన నుంచి మీకు ఏ సాయం కావాలో చెప్పండి. ముందుగా ఫైనల్‌లో భారత్ స్థానం సంపాదించాలి. అక్కడ నువ్వు హీరో అవ్వాలని నేను కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చింది. ఇక ఇది చూసిన వారు నిజంగానే ఆమె షమీకి ఫ్యాన్ అయిపోయిందా? అని ఆశ్చర్యపోతున్నారు.
మరోవైపు షమీ ఫ్యాన్స్ పాయల్‌పై మండిపడుతున్నారు. పెళ్లికి ఇంగ్లీష్‌కు సంబంధం ఏంటీ? ఎందుకు షమీని ఎగతాళి చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. షమీ వన్డే ప్రపంచకప్-2023 లో దుమ్ములేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. 16 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో టాప్ ఫైవ్ బౌలర్ల లిస్టులో చేరారు. అలా భారత్ విజయాల్లో షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఇండియా మొత్తం ఆయన పేరు మారుమోగుతోంది.
#Shami Tum apna English sudharlo, I’m ready to marry you 🤣🤣
— Payal Ghoshॐ (@iampayalghosh) November 2, 2023