Telugu News » Honeymoon Express : రొమాంటిక్‌ ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’.. రెండో పాట రిలీజ్

Honeymoon Express : రొమాంటిక్‌ ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’.. రెండో పాట రిలీజ్

ఈమధ్యే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ఇది రిలీజ్ అయింది. ఈ పాటలో హెబ్బా పటేల్, చైతన్య రావు మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. లిప్‌ లాక్‌ లతో ఇద్దరూ రెచ్చిపోయారు. ఇప్పుడు రెండో సాంగ్ కూడా ఆదరణ పొందాలని కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కోరుకున్నారు.

by admin
‘Prema’ from ‘Honeymoon Express’ is a romantic melody

‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సినిమాతో హీరో చైతన్య రావు, హీరోయిన్ హెబ్బా పటేల్ ఆడియన్స్‌ ను పలకరించబోతున్నారు. ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (NRI Entertainments) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

‘Prema’ from ‘Honeymoon Express’ is a romantic melody

తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్, బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీని నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్వరపరిచిన మరో రొమాంటిక్ పాట ‘ప్రేమ’ ను బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అందమైన ప్రేమ గీతానికి అనురాగ్ కులకర్ణి పాడాడు.

‘Prema’ from ‘Honeymoon Express’ is a romantic melody 1

ఈ కార్యక్రమానికి ఆర్పీ పట్నాయక్, గోపి మోహన్, చైతన్య ప్రసాద్, రవి వర్మ తదితరులు హాజరయ్యారు. అలాగే, ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి, అవసరాల శ్రీనివాస్, ఇంద్రగంటి మోహన కృష్ణ వీడియో కాల్స్ తో తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణి మాలిక్ కి కీరవాణి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల విడుదల అయిన నిజమా పాట అద్భుతంగా ఉందన్నారు. యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోందని చెప్పారు. ఇప్పుడు రెండో పాట ‘ప్రేమ’ కి మరింత ఆదరణ లభించాలి అని ఆశీర్వదించారు.

‘Prema’ from ‘Honeymoon Express’ is a romantic melody 3

ఈమధ్యే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ఇది రిలీజ్ అయింది. ఈ పాటలో హెబ్బా పటేల్, చైతన్య రావు మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. లిప్‌ లాక్‌ లతో ఇద్దరూ రెచ్చిపోయారు. ఇప్పుడు రెండో సాంగ్ కూడా ఆదరణ పొందాలని కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కోరుకున్నారు.

‘Prema’ from ‘Honeymoon Express’ is a romantic melody 2

సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ)
బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్
నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు
సంగీతం : కళ్యాణి మాలిక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్పీ పట్నాయక్
లిరిక్స్ : కిట్టు విస్సప్రగడ
ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా వీఎంకె
ఎడిటింగ్ : ఉమా శంకర్ జీ (యూఎస్ఏ), శ్రీ కృష్ణ అత్తలూరి
ఆడియో : టీ సిరీస్
పీఆర్వో : పాల్ పవన్
డిజిటల్ పీఆర్వో : వంశీ కృష్ణ (సినీ డిజిటల్)
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని

You may also like

Leave a Comment