Telugu News » Mehreen Pirzada : ‘స్పార్క్ లైఫ్’ వెరీవెరీ స్పెషల్.. మెహ్రీన్ తో ‘రాష్ట్ర’ స్పెషల్ ఇంటర్వ్యూ

Mehreen Pirzada : ‘స్పార్క్ లైఫ్’ వెరీవెరీ స్పెషల్.. మెహ్రీన్ తో ‘రాష్ట్ర’ స్పెషల్ ఇంటర్వ్యూ

స్పార్క్ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న విక్రాంత్ .. నాతో కలిసి నటించాలనుందని చెప్పారు. అలాగే, మూవీ స్క్రిప్ట్ విన్నాను. చాలా బాగా నచ్చింది.

by admin
raashtra special interview with mehreen pirzada

మొడల్ గా కెరీర్ ప్రారంభించి.. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మెహ్రీన్ (Mehreen Pirzada). తొలి సినిమాతోనే అందం, అభినయంలో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. వరుస ఆఫర్స్ అందుకుంది. మెహ్రీన్ లేటెస్ట్ మూవీ ‘స్పార్క్ లైఫ్’ (Spark Life). ఈనెల 17న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి క‌థ‌ను అందిస్తూ స్క్రీన్ ప్లే అందించాడు విక్రాంత్‌ (Vikranth). హీరో, దర్శకుడు కూడా ఇతనే. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై లీల నిర్మించారు. ‘‘హనీ ఈజ్ ద బెస్ట్’’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన మెహ్రీన్.. స్పార్క్ లైఫ్ విడుదల సందర్భంగా ‘రాష్ట్ర’ తో ముచ్చటించింది.

raashtra special interview with mehreen pirzada

– ‘స్పార్క్ లైఫ్’ ఆఫర్ ఎలా వచ్చింది?

కొత్తవాళ్లు, ఎక్స్‌పీరియెన్స్‌డ్ ఆర్టిస్టులతో కలిసి పని చేసే క్రమంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. స్పార్క్ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న విక్రాంత్ .. నాతో కలిసి నటించాలనుందని చెప్పారు. అలాగే, మూవీ స్క్రిప్ట్ విన్నాను. చాలా బాగా నచ్చింది.

– ఈ మూవీలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

స్పార్క్ మూవీ కోసం విక్రాంత్ చేసిన రీసెర్చ్ నన్ను ఆకట్టుకుంది. నా పాత్ర, లుక్ కొత్తగా అనిపించింది. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ.. పాటలు చూశాను. నా లుక్, పాటలను తెరకెక్కించిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది. విక్రాంత్ తను చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని అర్థమైంది. లేఖ అనే పాత్రలో కనిపిస్తాను. ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న రోల్. సినిమా నాతోనే స్టార్ట్ అవుతుంది. నాతోనే ఎండ్ అవుతుంది.

– విక్రాంత్ గురించి మీ ఒపీనియన్

విక్రాంత్ అమెరికాలో మంచి పోజిషన్‌ లో సెటిలయ్యారు. తనకు సినిమా చేయాలనే డ్రీమ్ ఉండటంతో దాన్ని పూర్తి చేసుకోవటానికి ఇక్కడకు వచ్చారు. ముందు వేరే డైరెక్టర్ అనుకున్నారు. కానీ.. చివరకు ఆయనే సినిమాను డైరెక్ట్ చేశారు. తొలిసారి హీరోగా చేస్తూనే డైరెక్షన్ చేయటం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. కానీ, విక్రాంత్ ఎంతో హార్డ్ వర్క్ చేసి సినిమాను కంప్లీట్ చేశారు. ఓ డెబ్యూ హీరో ఇంతలా కష్టపడటం మామూలు విషయం కాదు. ఆయన రెండు పాత్రలకు న్యాయం చేశారు.

– కథ గురించి ఏమన్నా చెప్తారా?

ఇలాంటి థ్రిల్లర్‌ లో నటించటం నాకు కొత్తగా అనిపించింది. ఎవరైనా కన్న కలలను నిజం చేసుకునే క్రమంలోనే ముందుకు వెళతారు. నేను కూడా అంతే. ఈ సినిమాలో నా పాత్ర కూడా అలాగే ఉంటుంది. అందుకనే నేను కనెక్ట్ అయ్యాను. అమెరికాలో జరిగిన కొన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని విక్రాంత్ కథను తయారు చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ ను మిక్స్ చేసి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు.

– మీ చిత్రాల ఎంపిక ఎలా ఉంటుంది?

ప్రతీ సినిమా నటిగా నాకెంతో ప్రత్యేకమైనదే. స్క్రిప్ట్, రోల్ నచ్చినప్పుడే ఓకే చేస్తాను. అది కెరీర్ పరంగానూ ఎంతో హెల్ప్ అవుతుంది. నన్ను ఇష్టపడేవారు, ప్రేక్షకులే నాకు ఇన్‌స్పిరేషన్ ఇస్తుంటారు. నటిగా నేను చేస్తున్న పాత్రకు రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాను. నేను ఏదైనా ఈవెంట్స్‌ కి వెళ్లినప్పుడు, ప్రమోషన్స్‌ లో ఉన్నప్పుడు ఎవరైనా నా క్యారెక్టర్ పేరుతో పిలిస్తే హ్యాపీగా ఉంటుంది. అదే నాకు స్పార్క్ మూమెంట్‌ గా అనిపిస్తుంది.

– ఇప్పుడేం సినిమాలు చేస్తున్నారు

ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా షూటింగ్ చేశాను. అది కూడా థ్రిల్లర్ మూవీనే. వసంత్ రవి హీరోగా నటిస్తున్నారు. ఆ డైరెక్టర్ కూడా డెబ్యూ డైరెక్టరే. కచ్చితంగా ఆ సినిమా కూడా అందరినీ మెప్పిస్తుందని భావిస్తున్నాను.

raashtra special interview with mehreen pirzada 1

You may also like

Leave a Comment