స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఘోర రోడ్డు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఎన్సీఐలో విశ్రాంతి తీసుకుంటూ తదుపరి మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా రిషబ్ పంత్ చిన్నారులతో గోళీలు(Marbles) ఆడుతూ సందడి చేశాడు. వాళ్లలో ఒకడిగా మారిపోయి సీరియస్‌గా ఆడుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, క్రికెట్‌కు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉన్నాడు రిషబ్ పంత్. వచ్చే ఐపీఎల్లో మరోసారి తన మెరుపులు మెరిపించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన చిన్నపిల్లలతో కలిసి పంత్ గోళీలు ఆడాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి కర్చీఫ్, తలకు క్యాప్ పెట్టుకున్నాడు.
మరోవైపు చిన్నపిల్లలతో కలిసి రిషబ్ కూడా ఓ పిల్లాడిలాగా మారిపోయి సీరియస్గా్ ఆటలో నిమగ్నమైపోయాడు. సరదాగా ఆడుతూ ఆ చిన్నారులతో ముచ్చటించాడు. అయితే, అందుకు సంబంధించిన ఈ వీడియోను పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
Rishabh Pant playing marble with kids.pic.twitter.com/wf2eRHA1uz
— Duck (@DuckInCricket) March 3, 2024
స్టార్ అయ్యి ఇంత డౌన్ టు ఎర్త్‌గా ఉన్నాడంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో పంత్ తను చిన్నానాటి రోజులను గుర్తుచేసుకున్నాడేమో అంటూ సరదాగా రాసుకొచ్చారు. తనని చూసి వారికి కూడా పాత రోజులు గుర్తొచ్చాయంటూ మరికొందరు గర్తుచేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.