Telugu News » Sachin Tendulkar: ‘నేనేం మిస్ అయ్యాను..?’ సచిన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..!!

Sachin Tendulkar: ‘నేనేం మిస్ అయ్యాను..?’ సచిన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..!!

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇరు జట్ల బౌలర్లు విజృంభించారు. దీంతో ఒక్క రోజే 23 వికెట్లు నేలకూలాయి. దీనిపై టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు.

by Mano
Sachin Tendulkar: 'What did I miss..?' Sachin's interesting tweet..!!

కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా(INDvsSA) మధ్య జరుగుతున్న రెండో టెస్టులో (2nd Test) ఇరు జట్ల బౌలర్లు విజృంభించారు. రెండు జట్లూ ఆలౌట్‌ అవడమే గాక రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక్క రోజే 23 వికెట్లు నేలకూలాయి. బౌలర్లు విజృంభించిన తొలి రోజుపై టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌(Sachin Tendulkar) ఆసక్తికర ట్వీట్‌ చేశాడు.

Sachin Tendulkar: 'What did I miss..?' Sachin's interesting tweet..!!

ఇది నమ్మశక్యంగా లేదని, తాను ఫ్లైట్‌ ఎక్కి ఇంటికి వచ్చేలోపే అసలు ఏం జరిగిందంటూ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా రాసుకొచ్చాడు. తొలి రోజు మ్యాచ్‌ ముగిసిన తర్వాత సచిన్‌ స్పందిస్తూ.. ‘2024లో క్రికెట్‌ ఒకే రోజు 23 వికెట్లు నేలకూలడంతో మొదలైంది. ఇది నమ్మశక్యంగా లేదు. సౌతాఫ్రికా ఆలౌట్‌ అయినప్పుడు నేను ఫ్లైట్‌ ఎక్కాను.’ ‘తొలి రోజు ఆట ముగిసేటప్పటికీ ఇంటికొచ్చి మ్యాచ్‌ చూద్దామని టీవీ పెట్టాను. సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయిందని కనబడుతోంది. ఈ గ్యాప్‌లో నేనేం మిస్‌ అయ్యాను..?’ అని రాసుకొచ్చాడు.

సచిన్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా ఫన్నీ మీమ్స్‌తో కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సఫారీలు మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. మహ్మద్‌ సిరాజ్‌ (6-15)తో పాటు బుమ్రా, ముఖేశ్‌ కుమార్‌ వేసిన బౌలింగ్‌ ధాటికి సౌతాఫ్రికా జట్టు తొలి సెషన్‌ కూడా ఆడకుండానే 55 పరుగులకే ఆలౌట్‌ అయింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ అదే రీతిలో తడపడింది. 34.5 ఓవర్లలో 153పరుగులకే ఆలౌట్‌ అయింది. టీమిండియా చివరి ఆరుగురు బ్యాటర్లైతే వరుసగా డకౌట్ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీలు 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేశారు.

You may also like

Leave a Comment