టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ డోస్ పెంచిన సమంత(Samantha).. ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలు తక్కువగా చేస్తూ వస్తోంది. అందుకు తన ఆరోగ్యం (Health) సహకరించకపోవడంతో కొంతకాలం పాటు విశ్రాంతి(REST) తీసుకున్నట్లు పేర్కొంది. సమంత గత కొంతకాలంగా ‘మయోసైటీస్’అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
దీంతో సామ్ చాలా వరకు సినిమాలను హోల్డ్ చేసింది. సమంత చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నా ఆరోగ్యం సహకరించక సిల్వర్ స్క్రీన్‌కు దూరమైంది. ప్రస్తుతం సామ్ విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చినట్లు టాక్. మరికొద్ది రోజుల్లో తిరిగి నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని భావిస్తోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ అండ్ మూవీస్‌కు సంబంధించి అప్డేట్స్ ఇస్తుంటారు.తన అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ కూడా చేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియా వినియోగంపై సమంత పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
‘సోషల్ మీడియాను(SOCial Media) తక్కువగా ఉపయోగించవద్దు. ఇంటర్నేషనల్ వైడ్ రేంజ్‌లో సోషల్ మీడియాలను వినియోగించాలి. మిమ్మల్ని ప్రేరేపించి వస్తువులు, వ్యక్తులను ఫాలో అవ్వండి. నిపుణులతో టైం స్పెండ్ చేయడం ద్వారా మీరు నిజమైన సానుకూల ధృక్పతాన్ని పొందుతారు. తెలివి తక్కువగా పోస్టులను స్క్రోలింగ్ చేయడం, ఫిర్యాదు చేయడం, ద్వేషించడం, ప్రతికూలమైన తప్పుడు ప్రచారాలను అస్సలు షేర్ చేయవద్దని’ సామ్ రాసుకొచ్చింది.