Telugu News » One More Earth : అంతరిక్షంలో మరోభూమిని కనుగొన్న నాసా…మరి ప్రాణుల ఉనికి..!?

One More Earth : అంతరిక్షంలో మరోభూమిని కనుగొన్న నాసా…మరి ప్రాణుల ఉనికి..!?

భూమికి సుమారు120 కాంతి సంవత్సరాల దూరంలో భూమికి పోలిన గ్రహాలను గుర్తించినట్లు నాసా తెలిపింది. వాటిపై జీవుల ఉనికికి సంబంధించిన పరిశోధనలు కీలకమైన విషయాన్ని గుర్తించినట్లు నాసా తాజా ప్రకటనలో తెలిపింది.

by sai krishna

భూమికి సుమారు120 కాంతి సంవత్సరాల దూరంలో భూమిని పోలిన గ్రహాలను గుర్తించినట్లు నాసా తెలిపింది. వాటిపై జీవుల ఉనికికి సంబంధించిన పరిశోధనలు కీలకమైన విషయాన్ని గుర్తించినట్లు నాసా తాజా ప్రకటనలో తెలిపింది.


మన సౌర కుటుంబానికి ఆవల సుదూరంలో భూమిని పోలిన గ్రహాన్ని గుర్తించామని, దానిపై సముద్రం ఆనవాళ్లు కనిపించాయని చెప్పుకొచ్చింది. భూమితో పోలిస్తే ఈ గ్రహం దాదాపు 8.6 రెట్లు పెద్దగా ఉంటుందని తెలిపింది.

అంతరిక్షం(space)లో అంతుచిక్కిన ఈ సరికొత్త గ్రహాన్ని ‘కే2-18 బి(K2-18 B)’గా నాసా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్నారు. ఇది, కే2-18 అనే శీతల మరుగుజ్జు నక్షత్రం కక్ష్యలో తిరుగుతోందని వివరించారు.


జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(James Web Space Telescope) సాయంతో ‘కే2-18బి’ గ్రహాన్ని గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహంపై మీథేన్(Methane), కార్బన్ డయాక్సైడ్(Carbon dioxide)ఉనికిని గుర్తించినట్లు వివరించారు.

పై మూలకాలున్నట్లైతే ఈ గ్రహం ఉపరితలం కింద మహా సముద్రం(Great ocean)ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, జీవం ఉన్నచోట మాత్రమే ఉత్పత్తయ్యే డిమెథైల్ సల్ఫైడ్ (డీఎంఎస్) ఆనవాళ్లను కూడా ఈ గ్రహంపై గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

You may also like

Leave a Comment