తెలుగు చలన చిత్ర పరిశ్రమలో (Tollywood) టాలెంట్‌కి ఎప్పుడు కొదువ లేదు. అందంతో పాటే అభినయం, టాలెంట్ కలబోసిన ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అటువంటి కోవకు చెందుతుంది ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి తక్కువ కాలమే అయినా చాలా మంచి గుర్తింపు దక్కించుకుంది.
నటించినా సినిమాలు ఒకటి రెండే అయినా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తోంది ఈ సుందరీ. మృణాల్ కి ముందు ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ తమ సత్తా చాటారు. ఈ అమ్మడు ఎప్పుడైతే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిందో నాటి నుంచి వారికి ఆఫర్స్ తగ్గిపోయానని టాక్ వినిపిస్తోంది.
హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’(SeetaRamam) మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది మృణాల్ ఠాకూర్. హీరో దుల్కర్ సల్మాన్‌కు జోడిగా అతనితో పోటీ పడి మరీ నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచింది ఈ అందాల సుందరి. సీతామహాలక్ష్మీ పాత్రలో ఆమె నటనకు గాను మంచి ప్రశంసలు అందుకున్నది.
అనంతరం నేచురల్ స్టార్ నానితో ‘హాయ్ నాన్న’ సినిమాలో తన యాక్టింగ్‌తో మరోసారి ఆకట్టుకుంది. ఆ సినిమా పెద్దగా హిట్ అందుకోకపోయినా తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం రౌడీ బాయ్ విజయ దేవరకొండ సరసన ‘ఫ్యామీలీ స్టార్’ మూవీలో చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది.
తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ఈ నటి కంటినిండా నిద్రపోయి చాలా రోజులు అయ్యిందని పేర్కొంది. వరుస సినిమాలతో నిద్ర సరిపోవడం లేదని పేర్కొంది మృణాల్. దాదాపు రెండేళ్లుగా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నానని.. చిన్న చిన్న విరామం దొరికినా ఫ్యామలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానని తెలిపింది. ఇప్పుడు బ్రేక్ తీసుకుని కాస్త ఫ్యామిలీతో గడపుతున్నానని చెప్పింది ఈ గ్లామరస్ బ్యూటీ..ఇలా చేయడం వలన స్టోరీల విషయంలో మంచి ఫర్ఫేక్షన్ ఉంటుందని చెప్పుకొచ్చింది.