Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. కొందరు మంత్రులపై భూ కబ్జా ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి.. కానీ వాటి విషయంలో చర్యలు లేవనే ఆరోపణలున్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గులాబీ నేతలో కొందరి పేర్లు అయితే తెరమీదికి రావడమే కాదు.. భూ కబ్జా కేసులు సైతం నమోదైన సంగతి తెలిసిందే..
నిన్నటికి నిన్న బంజారా హిల్స్ (Banjara Hills)లో, ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో.. బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే, కందాల ఉపేందర్‌రెడ్డి (Kandala Upender Reddy)పై భూకబ్జా కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో షేక్‌పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ ఘటన మరవక ముందే.. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.
ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) భూమి కబ్జా చేశారని ఆరోపిస్తూ.. సోమాజిగూడ (Somajiguda).. ప్రజా భవన్ వద్ద ఆందోళనకు దిగారు.. నేడు జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో బేగంపేట, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీ ప్రాంతానికి చెందిన బాధితులు.. ఫ్లెక్సీలు, ప్లకార్డ్స్ పట్టుకొని ఆందోళన చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నోటరీ భూములను కొనుక్కోని 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నట్టు తెలిపారు.
ఈక్రమంలో తమ భూమిని ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనుచరులతో భయభ్రాంతులకు గురిచేసి భూమిని కబ్జా చేయాలని చూశాడని బాధితులు ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన న్యాయం జరగలేదని వాపోయారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతుందని ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేయడానికి వచ్చినట్టు వెల్లడించారు..


