అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమిపై ఇంకా ఆ పార్టీ నేతలకు ఒక క్లారిటీ రానట్టు ఉందని అనుకొంటున్నారు. ఇప్పటికీ ఇదే విషయాన్ని పదే పదే వల్లే వేస్తున్న కేటీఆర్ (KTR) తీరును గమనిస్తున్న వారు.. పార్టీల మధ్య విమర్శలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి కానీ ప్రస్తుతం వ్యక్తి గత కక్షలతో విమర్శించు కొన్నట్లు ఉందని భావిస్తున్నారు.. ఇక నల్లగొండ (Nalgonda) లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్న ఆయన.. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అనుకొంటున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయని తెలిపిన కేటీఆర్.. ఇంకా మనం మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. అప్పుడే కాంగ్రెస్ (Congress) వాళ్ళు ఉలికి పడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ నేతల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఉహించుకోండని అన్నారు. కరెంటు బిల్లులు కట్టవద్దని గత నవంబర్ లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించినట్టు తెలిపిన కేటీఆర్.. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా ఆయనకు పంపండని పిలుపునిచ్చారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు మొదటి సారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించేలా చేసిందని కాంగ్రెస్ పై మండిపడ్డారు.
రాష్ట్రంలో వేసవి రాకముందే కరెంటు కోతలు మొదలయ్యాయన్న కేటీఆర్.. శ్రీ రాం సాగర్ చివరి ఆయకట్టును ప్రభుత్వం ఎండ బెడుతోందని ఆరోపణలు చేశారు.. నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో కాంగ్రెస్- బీజేపీ అక్రమ బంధం బయట పడిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి భుజం మీద తుఫాకీ పెట్టి బీఆర్ఎస్ ను కాలుస్తారట.. ఈ రెండు పార్టీలు ఒక్కటే అని ఇప్పటికైనా గుర్తించండని అన్నారు..