రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా నార్సింగి (Narsinghi)లో విషాదం చోటుచేసుకొన్నది. నార్సింగి అల్కాపురి కాలనీలో ఉన్న మదర్సాలో (Madrasa) విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. చిన్న వివాదంలో 12 ఏళ్ల బాలుడిపై తోటి విద్యార్థులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దీంతో బాలుడు మృతిచెందాడు.
బీహార్‌కు చెందిన 12 మంది విద్యార్థులు మదర్సాలో ఉంటున్నారు. గురువారం రాత్రి చిన్న వివాదంలో పన్నేండ్ల మహ్మద్ రకీమ్‌పై తోటి విద్యార్థులు దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో మదర్సా సిబ్బంది రకీమ్‌ను హుటాహుటిన గోల్కొండలోని దవాఖానకు తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్‌ను అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు.. 304-II సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.