నందమూరి బాలకృష్ణ గురించి పరిచయం చేయక్కర్లేదు. నందమూరి వారసుడిగా బాలయ్య ఇండస్ట్రీలోకి వచ్చారు. తండ్రికి తగ్గ తనయుడు పేరు తెచ్చుకున్నారు బాలయ్య. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించారు ఎంతోమంది అభిమానుల్ని కూడా బాలయ్య సంపాదించుకున్నారు. అయితే బాలయ్య కి సంబంధించిన సినిమాల విషయాలు పాలిటికల్ విషయాలు మనకు తెలుసు. కానీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలు తెలియవు. బాలకృష్ణ రెండవ కూతురు తేజస్విని గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? బాలయ్య కి చిన్న కూతురు అంటే చాలా భయం.
బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి నారా లోకేష్ భార్య హెరిటేజ్ వ్యవహారాలని చూసుకుంటారు. కానీ బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఏం చేస్తారు..? ఆమె ఎక్కడ ఉంటారు అనే వివరాలు మనకి తెలియదు మరి బాలయ్య చిన్న కూతురు తేజస్వి ఏం చేస్తారు ఆమె ఎక్కడ ఉంటారు అనే విషయాలను ఇప్పుడే చూస్తాం. బాలయ్య నిజానికి బయట ఎవరికి భయపడరు కేవలం తేజస్వినికి మాత్రమే భయపడతారు. ప్రస్తుతం బాలయ్య సినిమాకు సంబంధించిన వ్యవహారాలని తేజస్విని చూసుకుంటారు.
Also read:
ఇదివరకు బాలయ్య సినిమా డేట్స్ ఇతర ప్రోగ్రాంలను డాక్టర్ సురేందర్ చూసుకునే వారు కానీ ఇప్పుడు తేజస్విని చూసుకుంటున్నారట. అంతేకాకుండా బాలయ్య ఎటువంటి దుస్తులు వేసుకోవాలి అనే వాటిని కూడా తేజస్విని నిర్ణయిస్తారట. అలానే బాలయ్య కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు గురించి బాలయ్య భార్య ఇది వరకు చూసుకునేవారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా తేజస్విని చూసుకుంటున్నారు. తేజస్విని గీతం యూనివర్సిటీ యజమాని మూర్తి మనవడు శ్రీ భరత్ ని పెళ్లి చేసుకున్నారు తేజస్విని తన కుటుంబ వ్యవహారాలను చూసుకుంటూ బాలయ్య సినిమా పనులను కూడా చూసుకుంటూ ఉంటారట