ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ప్రేమలో పడడం కామన్ అయిపోయింది. తాజాగా లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్‌తేజ్‌తో ప్రేమ వివాహం(Love Marriage) చేసుకుంటోంది. అయితే ఇండస్ట్రీలో మరో హీరోయిన్ ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ శ్రీదివ్య(Heroin Sridivya).
శ్రీదివ్య మన తెలుగమ్మాయే. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ‘బస్‌స్టాప్’, ‘కేరింత’ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఈ హీరోయిన్ వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండా పోయింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది ఈ అమ్మడు.
శివకార్తికేయన్ హీరో ‘వరుత్తపడాద వాలిబర్ సంఘం’ అనే మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అప్పటి నుంచి తమిళంలోనే వరుసపెట్టి సినిమాలకు అగ్రిమెంట్ ఇచ్చేస్తోంది. ‘కాక్కీ సట్టె’, ‘జీవా’, ‘ఈటీ’, ‘మరుదు’, ‘బెంగుళూర్ నాట్కల్’, ‘పెన్సిల్’ వంటి పలు చిత్రాల్లో నటించింది. అక్కడ విడుదలైన కొన్ని సినిమాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి.
ప్రస్తుతం విక్రమ్ ప్రభు ‘రైడ్’ సినిమాలో హీరోయిన్గా నటించింది శ్రీదివ్య. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో శ్రీదివ్యని ప్రేమ, పెళ్లి గురించి రిపోర్టర్ ప్రశ్నించాడు. దానికి శ్రీదివ్య త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ వివాహమే చేసుకుంటాను. అదీ నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పేసింది. దీంతో ఎవరా అబ్బాయి?, ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది. ఎక్కడ చేసుకుంటుంది అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.