బాలీవుడ్ లవ్లీ కపుల్ అలియా భట్(Alia Bhatt), రణబీర్ కపూర్(Ranbir Kapoor) వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అయితే, వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అలాంటి చర్చలకు అలియా భట్ చెక్ పెట్టింది. ట్రోలింగ్(Trolling) చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఇటీవల సోషల్ మీడియాలో అలియాభట్ మేకప్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ రణ్‌బీర్ కపూర్‌పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది. రణబీర్ కపూర్‌కు అలియా లిప్ స్టిక్ వేసుకోవడం ఇష్టముండదని.. దీనికి ‘టాక్సిక్’ అని ట్యాగ్ చేస్తూ కొందరు ట్రోల్ చేశారు. దీనిపై అలియాభట్ ఓ షోలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్లో ‘కాఫీ విత్ కరణ్’ అనే షోలో కరణ్ జోహార్ సంగతి తెలిసిందే. సెలబ్రెటీలను వ్యక్తిగత ప్రశ్నలు మొహమాటంగా అడిగేస్తూ ఇరకాటంలో పెడుతుంటాడు. అయితే, ఈ షోకి వచ్చిన అలియాభట్నూ కరణ్ వదలలేదు. రణ్‌బీర్ కపూర్‌పై వచ్చిన ట్రోలింగ్ విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో ఇన్ని రోజులూ ఈ విషయంపై మౌనంగా ఉన్న అలియాభట్ స్పందిస్తూ.. తన భర్త వ్యక్తిత్వం అలాంటిది కాదని చెప్పింది.
‘ఇలా జరగడం నాకు బాధగా ఉంది. ఎందుకంటే రణబీర్ కపూర్ వ్యక్తిత్వం నాకు తెలుసు. నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా సహచరులు కూడా నాతో చెప్పారు. కానీ రణ్ బీర్ కపూర్ పై కథనాలు రాసారు. ప్రపంచంలో దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి’ అంటూ అలియా భట్ చెప్పుకొచ్చింది.