బాలీవుడ్ జంట దీపికా పదుకొనే(Deepika Padukone), రణ్‌వీర్‌సింగ్(Ranveer Singh) ఇటీవల కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో దీపిక.. భర్త కంటే ముందు పలువురితో ప్రేమలో పడ్డ విషయాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా రణవీర్ సింగ్ పరిచయమయ్యాక కూడా చాలామందిని కలిశానని, అయితే ఎవరూ తనకు కనెక్ట్ కాలేదని, రణ్వీర్ మాత్రమే సరైన జోడీ అనిపించిందని చెప్పుకొచ్చింది.
దీపికా మాట్లాడిన మాటలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ నడిచింది. తాజాగా దీపికాకు సీనియర్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా మద్దతు తెలిపింది. ట్వింకిల్ తన బ్లాగ్‌లో ‘‘డియర్ ఆంటీస్, అంకుల్స్ అలాగే అంతగా అర్హతలేని బ్యాచిలర్స్.. దీపికా తన కాబోయే భర్తతో డేటింగ్ చేస్తూనే ఇతర పురుషులతో డేటింగ్ చేసింది అని తను చెప్పలేదు. కానీ ట్రోలింగ్ చేయడం విస్మయం కలిగిస్తోంది. దీపికా ఆలోచన చాలా మంది మహిళలను పెళ్లి విషయంలో కాపాడుతుందని నేను అనుకుంటున్నాను.’ అని పేర్కొంది.
అదేవిధంగా ‘నేను ఓదశలో కష్టమైన సంబంధాలను వదులుకుని ఒంటరిగా ఉండాలని కోరుకున్నాను. ఎవరికీ అటాచ్ కావాలనుకోలేదు. మనం సోఫా కొనడానికి వెళ్లినప్పుడు ఏది సౌకర్యవంతగా ఉంటుందో అది కొనడానికి ఆసక్తి చూపిస్తాం. కాబోయే భర్త విషయంలోనూ అంతే. నేను దీపిక నిర్ణయం చాలా సరైనదని భావిస్తున్నాను. ఇలా చేయడం వల్ల చాలా మంది స్త్రీలు మోసపోకుండా కాపాడవచ్చు’ అంటూ ట్వింకిల్ రాసుకొచ్చింది.
ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ట్వింకిల్.. బాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు తెలుగులో హీరో వెంకటేష్‌తో కలిసి 1999లో వచ్చిన ‘శీను’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. 2001లో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలు చేయడం మానేసింది. ఆమె నటిగానే కాకుండా ఇంటీరియల్ డిజైనర్‌గా, పలు సినిమాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించింది.