Telugu News » Sreeleela: నెలకో సినిమా.. శ్రీలీలకు పెద్ద కష్టమే వచ్చి పడింది..!!

Sreeleela: నెలకో సినిమా.. శ్రీలీలకు పెద్ద కష్టమే వచ్చి పడింది..!!

శ్రీలీల నటించిన ఆదికేశవ(Aadi Keshava) బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేలా కనబడుతోంది. ఆదికేశవ అంచనాలు తప్పడంతో మహేశ్‌బాబుతో గుంటూరు కారం, నితిన్‌తో ఎక్స్‌ ట్రార్డినరీ మ్యాన్ సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది శ్రీలీల.

by Mano
Sreeleela: Nelko movie.. Sreeleela faced a lot of trouble..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం లాంటింది. ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలంటే ఒక శుక్రవారం దశ తిరిగితే చాలు. హీరోయిన్ శ్రీలీల(Heroin Sreeleela) విషయంలోనూ అదే జరిగింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తీసిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమై ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.

Sreeleela: Nelko movie.. Sreeleela faced a lot of trouble..!!

అయితే ఇప్పుడు ఈ బ్యూటీకి పెద్ద సమస్యే వచ్చిపడింది. ఈ హీరోయిన్ నటించిన ఆదికేశవ(Aadi Keshava) బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేలా కనబడుతోంది. ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు నిర్మాతలు క్యూకట్టారు. దీంతో కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏకంగా పది సినిమాల వరకు సంతకాలు చేసేసింది.

sreelela

దీంతో శ్రీలీల క్షణం తీరిక లేకుండా సినిమాల్లో బిజీ అయిపోయింది. నెలకో సినిమాను విడుదలకు సిద్ధం చేస్తోంది. అయితే అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వడంలేదు. దీంతో శ్రీలీల అయోమయంలో పడింది. ఒక సినిమా హిట్ కావాలంటే అందులో చాలా కారణాలు ఉండొచ్చు. సాంకేతిక బృందంతో పాటు కాంబినేషన్ల విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇటీవల శ్రీలీల చేసిన సినిమాల ఫలితాలను చూస్తే.. మొదటగా స్కంద పేరు చెప్పుకోవాలి. రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన స్కంద ఎన్నో రకాలుగా ట్రోల్ అయింది. హ్యాట్రిక్ అందుకుందాం అనుకున్న శ్రీలీల ఆశలను ఈ సినిమా ఆవిరి చేసింది. దసరాకు విడుదలైన భగవంత్ కేసరితో ఫామ్‌లోకి వచ్చినా ఇందులో శ్రీలీల కూతురు పాత్రలో నటించింది.

Sreeleela: Nelko movie.. Sreeleela faced a lot of trouble..!!

గతంలో ‘ఉప్పెన’ సినిమాతో కుర్రకారును హృదయాలను కొల్లగొట్టిన కృతిశెట్టి ఆ సినిమా తర్వాత వరుసగా ఐదు ఫ్లాపులను మూటగట్టుకుంది. ప్రస్తుతం ఆ హీరోయిన్ కనిపించకుండా పోయింది. ఇప్పుడు శ్రీలీల అదే బాట పడుతుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఆదికేశవ అంచనాలు తప్పడంతో మహేశ్‌బాబుతో గుంటూరు కారం, నితిన్‌తో ఎక్స్‌ ట్రార్డినరీ మ్యాన్ సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది శ్రీలీల.

You may also like

Leave a Comment