టాలీవుడ్ నటి, యాంకర్ రష్మి గౌతమ్(Rashmi Goutham) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో(Jabardasth Show) ద్వారా యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల్లోనూ చిన్నచిన్న పాత్రలు చేస్తోంది.
అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే రష్మి లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు.. అభిమానులతో అప్పుడప్పుడు చిట్‌చాట్ చేస్తుంటుంది. వీలున్నప్పుడల్లా తను పోస్టు చేసే ఫొటోలకు వచ్చే కామెంట్స్‌కు స్పందిస్తూ ఉంటుంది. అయితే, తాజాగా రష్మి ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తానేమైనా చట్టానికి వ్యతిరేకమైన పనులు చేశానా? అంటూ ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ఓ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ రిప్లయ్ ఇస్తూ.. ‘‘కాషాయపు రంగు చీర కట్టి.. అన్నీ చెడ్డ పనులు చేస్తున్నావు.’’ అంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మి మండిపడింది.
ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ‘‘నేనేమైనా బిల్లులు కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టానా? లేదా నా తల్లిదండ్రుల్ని రోడ్డున వదిలేశానా? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా? ట్యాక్సులు కట్టలేదా? అసాంఘిక కార్యకలాపాలు, అకృత్యాలు చేశానా? ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా? మీ దృష్టిలో అసభ్యకరమైన పనులంటే ఏమిటి?’’అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది రష్మి.
అదేవిధంగా ‘‘ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు ఎక్కువగా వింటున్నా. పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. నా వరకు దేవుడు అందరి వాడు. సనాతన ధర్మంలోని మంచి విషయం అదే..’’ అంటూ రష్మి గౌతమ్ రాసుకొచ్చింది. ఆమె రిప్లైకి నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.
Have I not paid my bills or not taken responsibility of my family
Have I left my parents on the roads to fend for themselves
Have I not paid my taxes ?
Am I doing any illegal activities
Have I been charged for anything
What exactly is LANGA PANILU
I have been seeing these… https://t.co/Y0k5kv1AbQ— rashmi gautam (@rashmigautam27) January 23, 2024