బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సినిమాలతో పాటు వైవాహిక జీవితానికీ న్యాయం చేస్తున్నారు. ఇటీవలే అనుష్కా శర్మ(Anushka Sharma) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) తాను తల్లికానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తాజాగా కత్రినాకైఫ్(Katrina Kaif) కూడా శుభవార్త చెప్పొచ్చని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బాలీవుడ్ కపుల్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కూడా హాజరయ్యారు.
ఈ వేడుకల్లో కత్రినా ఎప్పటికప్పుడు తన పొట్టభాగం కనపడకుండా దుపట్టాతో కవర్ చేసింది. ముంబైకి తిరిగి వెళ్లే క్రమంలోనూ ఉదర భాగాన్ని కవర్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కత్రినా గర్భంతో ఉందని, అందుకే బేబీ బంప్ కనిపించకుండా జాగ్రత్తపడిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్లది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి 2021 డిసెంబర్ నెలలో వివాహమైంది. కత్రినా, విక్కీల పెళ్లి జరిగి సుమారు రెండున్నరేళ్లు అవుతోంది. మరి కత్రినా తల్లి కాబోతున్నారనే వార్తలో ఎంతనిజం ఉందో తెలియాలంటే?.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
VIDEO | Actors Vicky Kaushal and Katrina Kaif leave from Gujarat's Jamnagar after attending the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/DQYXCau1c7
— Press Trust of India (@PTI_News) March 4, 2024