పవన్‌కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh) టీజర్ మంగళవారం విడుదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రావని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు టీజర్‌తో సప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి.
విడుదలైనప్పటి నుంచి ఈ టీజర్ ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 3.5మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ టీజర్లో ‘‘గాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం..’’ అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జనసేన గుర్తు గాజు గ్లాసు కావడంతో ఈ డైలాగ్ కు మరింత రీచ్ వచ్చింది.
అయితే ఇప్పుడు అదే డైలాగ్ ఈ టీజర్‌ని చిక్కుల్లో పడేసింది. టీజర్లో గాజు గ్లాసు డైలాగ్ ఎలక్షన్ కమిషన్ వరకూ వెళ్లింది. ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు ఏమైనా విడుదల చేయాలనుకొంటే, ఎలక్షన్ కమిషన్ అనుమతి తప్పనిసరి.
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టీజర్ వెనుక రాజకీయ ప్రచారం ఉద్దేశం ఉంటే టీజర్‌ను తక్షణమే తొలగించాల్సి ఉంటుంది. టీజర్ విషయంలో ఎవరూ కంప్లైంట్ చేయలేదని, ఒకవేళ ఆ టీజర్ వెనుక తమ గాజు గ్లాసు గుర్తుని ప్రచారం చేసుకొనే ఉద్దేశం ఉందని తెలిస్తే, అప్పుడు ఈ విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తామని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది.