Telugu News » Rashmika Mandanna : అభిమానులకు ట్విస్ట్ ఇచ్చిన రష్మిక మందన్న.. ఈమె ఎవరంటూ ఫోటో పోస్ట్..

Rashmika Mandanna : అభిమానులకు ట్విస్ట్ ఇచ్చిన రష్మిక మందన్న.. ఈమె ఎవరంటూ ఫోటో పోస్ట్..

రష్మిక మందన్న(Rashmika Mandanna) ఒకరు. గీత గోవిందం( Geetha Govindam), పుష్ప ( Pushpa) వంటి భారీ హిట్స్‌తో అగ్ర హీరోయిన్‌ బెర్త్ కన్ఫమ్ చేసుకొన్న ఈ బ్యూటీ ప్రస్తుతం 8 సినిమాల్లో నటిస్తోంది.

by Venu

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకుని కుర్రకారు మతులు పోగొడుతోన్న హీరోయిన్లలో రష్మిక మందన్న(Rashmika Mandanna) ఒకరు. గీత గోవిందం( Geetha Govindam), పుష్ప ( Pushpa) వంటి భారీ హిట్స్‌తో అగ్ర హీరోయిన్‌ బెర్త్ కన్ఫమ్ చేసుకొన్న ఈ బ్యూటీ ప్రస్తుతం 8 సినిమాల్లో నటిస్తోంది. మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి స్టార్ హీరోల సరసన చిందులేసి మరింత క్రేజ్ దక్కించుకుంది ఈ అమ్మడు.

ఇక రష్మిక ఎంత బిజీగా ఉన్నా అభిమానులతో టచ్ లో ఉంటూ తన సినిమా ముచ్చట్లను అభిమానులతో షేర్ చేసుకొంటుంది. అప్పుడప్పుడు ఊహించని ట్విస్ట్ కూడా ఇస్తోంది. ఈ నేపథ్యంలో రష్మికకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనతో పాటుగా ఉన్న ఒక లేడి ఫోటోను చూపిస్తూ ఈమె ఎవరో చెప్పుకోండి అంటున్నారు రష్మిక మందన్న. ఇక రష్మిక అభిమానులు ఆమె ఎవరా అంటూ ఆరాతీయడం మొదలు పెట్టారు.

ఇక అసలు విషయానికి వస్తే ఫోటోలో రష్మికతో పాటుగా కన్పిస్తోంది రష్మిక తల్లి. పేరు సుమన్ మందన్న. ప్రస్తుతం రష్మిక వయసు 27 ఏళ్ళు. ఆ లెక్కన చూసుకుంటే ఆమె తల్లికి 45 ఏళ్ల పైగానే వయసు ఉంటుందని అనుకుంటారు. కానీ చూసేందుకు రష్మిక తల్లి మాత్రం చాలా యంగ్గా కనిపిస్తారు. 30 ఏళ్ల వయసున్న ఆమె రష్మికకు అక్క లాగా ఉంటారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చివరికి ఆమె రష్మిక తల్లి అని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అచ్చం అమ్మ లాగానే రష్మిక ఉందని వారు అంటున్నారు.

ఇకపోతే కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పుష్ప 2 సినిమాతో ఆమె రేంజ్ మరో లెవెల్ కి వెళ్ళడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ తో రష్మిక డేటింగ్ చేస్తుందని గాసిప్స్ చక్కర్లు కొడుతుండగా ఈ విషయంలో వీరు ఇప్పటి వరకు స్పందించలేదు.

You may also like

Leave a Comment