Telugu News » Prabhas Anushka : ప్రభాస్ అనుష్క పెళ్లిచేసిన ఫ్యాన్స్.. వైరల్ అవుతోన్న ఫోటోస్..

Prabhas Anushka : ప్రభాస్ అనుష్క పెళ్లిచేసిన ఫ్యాన్స్.. వైరల్ అవుతోన్న ఫోటోస్..

ప్రభాస్ భార్య పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేయడం చూసి షాక్ అవుతున్నారు. నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

by Venu

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ (Prabhas) పెళ్లి గురించి వార్తలు ఎప్పటినుంచో వైరల్ (Viral) అవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ప్రభాస్ మ్యారేజ్ అనేది అభిమానులను ఒక మిస్టరీగా మారింది.

తన అభిమాన హీరో మ్యారేజ్ చేసుకొంటే చూడాలని తెగ వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ప్రస్తుతం ప్రభాస్ భార్య పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేయడం చూసి షాక్ అవుతున్నారు. నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకు ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన అసలు మ్యాటర్ ఏంటంటే..

ప్రభాస్ పెళ్లి గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఏఐ (AI) సాయంతో ఓ ఫ్యామిలీని క్రియేట్ చేశారు. అలా క్రియేట్ చేసిన ప్రభాస్ భార్య, పిల్లల ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ (Artificial Technology) ఉపయోగించి ప్రభాస్, అనుష్కకు పెళ్లి జరిగినట్టుగా వీరికి ఒక పాప, బాబు ఉన్నట్టుగా ఫోటోస్ డిజైన్ చేశారు ఫ్యాన్స్. ఇలా మొత్తానికి కొంత మంది ఫ్యాన్స్ ప్రభాస్ అనుష్కకు పెళ్లి చేసారాండోయ్. కానీ రియల్ లైఫ్ లో మాత్రం కాదు.

ఇకపోతే మొదటి నుంచి ప్రభాస్, అనుష్క(Anushka) మంచి స్నేహితులు. వీరిద్దరికీ పెళ్లి జరిగితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతోన్న విషయం తెలిసిందే. అదీగాక గతంలో వచ్చిన బిల్లా, మిర్చి చిత్రాలలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. ఈ ఆన్ స్క్రీన్ జంటకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. వీరిద్దరూ రియల్ లైఫ్ లో జోడి అయితే బాగుంటుందని ఆశపడుతోన్న ఫ్యాన్స్ కలలు మొత్తానికి ఏఐ సాయంతో అయినా నెరవేరాయని ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment