బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. 2018లో ‘జీరో’ అనే సినిమా తర్వాత ఈమె నటించిన మరో సినిమా ఇంతవరకు విడుదల కాలదు. ఇది అనుష్క అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో వివాహం అయ్యాక సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ దంపతులకు ఓ కూతురు జన్మించిన తర్వాత కూడా మరో బిడ్డ రాకకోసం ఎదురుచూస్తున్నట్లు పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అయితే దీనిపై అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే అనుష్క మరో గాసిప్ కూడా వినిపిస్తోంది. అనుష్క రెండో సంతానం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్తుందని కొందరు అంటున్నారు.
పెళ్లికి ముందు ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ మాట్లాడుతూ ‘నాకు పెళ్లి చాలా ముఖ్యం. నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకుంటున్నా. పెళ్లి అయ్యాక నాకు సినిమాల్లో నటించడం అంత ఇష్టం ఉండకపోవచ్చు’ అని చెప్పుకొచ్చింది. కుటుంబం, పిల్లలపై అనుష్క తన నిర్ణయాన్ని అప్పుడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనుష్క శర్మ 2008లో సినిమాల్లోకి వచ్చింది. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణించింది. ఆమె నటించిన ‘చక్డా ఎక్స్ ప్రెస్’ సినిమా పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుష్క రెండో సంతానం సంతానం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.