కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష(Trisha) జంటగా నటించిన చిత్రం ‘లియో’. అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమాపై ఒక ఇంటర్వ్యూలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.
మన్సూర్ అలీ ఖాన్ ఆ ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే.. ‘నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. రేప్ సీన్లు నాకు కొత్త కాదు. లియో చిత్రీకరణ సమయంలో మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్‌రూమ్ తీసుకెళ్లే సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ అలా జరగలేదు. త్రిషను కనీసం నాకు చూపించలేదు.’ అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు.
దీంతో ఆయన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడుతున్నారు. దర్శకుడు లోకేష్ కానగరాజ్, సింగర్ చిన్మయి శ్రీపాద, మలయాళ నటి మాళవిక మోహన్, ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ ఘటనపై త్రిష ఘాటుగా స్పందించింది. ‘అలాంటి వ్యక్తితో ఇప్పటివరకు నటించనందుకు నేను అదృష్టవంతురాలిని. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరమైనదిగా అనిపిస్తోంది. నా మిగిలిన కెరీర్‌లో, నా సినిమాలో అతడు లేకుండా చూసుకుంటాను.’ అంటూ త్రిష రాసుకొచ్చింది. పలువురు సినీతారలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.
A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen…
— Trish (@trishtrashers) November 18, 2023