Telugu News » Animal Movie: బాక్సాఫీస్ వద్ద గర్జిస్తున్న‘యానిమల్’.. 11 రోజుల కలెక్షన్లు ఎంతంటే..?

Animal Movie: బాక్సాఫీస్ వద్ద గర్జిస్తున్న‘యానిమల్’.. 11 రోజుల కలెక్షన్లు ఎంతంటే..?

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్‌ నటించిన ‘యానిమల్’ సినిమా(Animal Movie) ఇటీవలే విడుదలై ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'యానిమల్’ టోటల్ కలెక్షన్ రూ.717.46 కోట్లు రాబట్టి రూ.1000కోట్లు దిశగా దూసుకెళ్తోంది. ఈ వారంలో ఆ రికార్డునూ దాటొచ్చని సినీవర్గాలు అంటున్నాయి.

by Mano
Animal Movie: 'Animal' roaring at the box office.. What is the 11 day collections..?

అర్జున్‌రెడ్డి సినిమాతో టాలీవుడ్‌ బాక్సాఫీస్ రికార్డుల ట్రెండ్‌నే మార్చేశాడు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ(Director Sandeep Reddy Vanga). డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి తిరుగులేని డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అర్జున్‌రెడ్డిని హిందీలో ‘కబీర్ సింగ్’ తెరకెక్కించి అక్కడా బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.

Animal Movie: 'Animal' roaring at the box office.. What is the 11 day collections..?

ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్‌తో తీసిన ‘యానిమల్’ సినిమా(Animal Movie) ఇటీవలే విడుదలై ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, రష్మిక మందన్న ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. యానిమల్.. బాక్సాఫీస్(Box office) వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ టోటల్ కలెక్షన్ రూ.717.46 కోట్లు రాబట్టి రూ.1000కోట్లు దిశగా దూసుకెళ్తోంది. ఈ వారంలో ఆ రికార్డునూ దాటొచ్చని సినీవర్గాలు అంటున్నాయి. ఈ సినిమా విడుదలైన పదో రోజే రూ.52కోట్లను క్రాస్ చేయడం విశేషం. ఈ సినిమాతో రణబీర్ రేంజ్ మరోస్థాయికి వెళ్లిందనే చెప్పాలి. ఈ హీరో నటనను అందరూ ప్రశంసిస్తున్నారు.

డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీపై బోల్డ్ కంటెంట్, హింస ఎక్కువైందని విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయినా ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అంతేకాదు రణబీర్ కపూర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే దీనిపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment