Telugu News » Anushka Sharma Pregnancy: అనుష్క శర్మ మళ్లీ ప్రగ్నెంట్..? ప్రూఫ్ ఇదేనట..!

Anushka Sharma Pregnancy: అనుష్క శర్మ మళ్లీ ప్రగ్నెంట్..? ప్రూఫ్ ఇదేనట..!

తాజాగా ఈ దంపతులకు సంబంధించిన ఓ వైరల్‌ వీడియోలో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ హోటల్‌లో విరాట్, అనుష్క ఉన్న వీడియోను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. అనుష్క మళ్లీ గర్భం దాల్చిందనడానికి ఇదే తమ ప్రూఫ్ అంటూ నెటిజన్లు హడావుడి చేసేస్తున్నారు.

by Mano
Anushka Sharma Pregnancy: Anushka Sharma Pregnant Again..? This is the proof..!

విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ(Virat Kohli-Anushka Sharma) దంపతులు పర్సనల్ విషయాలను మీడియాతో అస్సలు పంచుకోరు. తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ దంపతుల అభిమానులు(Fans) మాత్రం వారి గురించి తెలుసుకోవాలనే కుతూహంతో ఉంటారు. ఈ క్రమంలో అనుష్కశర్మ మళ్లీ గర్భం(Pregnancy) దాల్చిందన్న వార్తలు ఈ మధ్య కాలంలో ట్రెండ్(Trend) అయిన సంగతి తెలిసిందే.

Anushka Sharma Pregnancy: Anushka Sharma Pregnant Again..? This is the proof..!

అయితే తాజాగా ఈ దంపతులకు సంబంధించిన ఓ వైరల్‌ వీడియోలో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ హోటల్‌లో విరాట్, అనుష్క ఉన్న వీడియోను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అనుష్క వదులైన నల్లని దుస్తుల్లో మెరిసింది. ఆ దంపతులు ఒకరి చేయి మరొకరు పట్టుకుని వెళుతున్న దృశ్యం కనిపించింది.

దీంతో అనుష్క మళ్లీ గర్భం దాల్చిందనడానికి ఇదే తమ ప్రూఫ్ అంటూ నెటిజన్లు హడావుడి చేసేస్తున్నారు. ప్రెగ్నెన్సీ విషయం ఆల్మోస్ట్ కన్ఫామ్ అనేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, అనుష్క బేబీ బంప్ కూడా వీడియోలో కనిపిస్తోందని అంటున్నారు. ఫలితంగా, విరాట్-అనుష్క దంపతులు మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు.

అయితే, ఈ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు ఆమె రెండవ గర్భం గురించి విని ఆశ్చర్యపోతుండగా, కొంతమంది అభిమానులు కూడా ఈ జంటను అభినందించడం ప్రారంభించారు.

You may also like

Leave a Comment