అక్కినేని నాగేశ్వరరావు నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఆయన నటనతో మంచి పేరుని కూడా తెచ్చుకున్నారు. నటవరసటిగా హీరో నాగార్జున ని బాల నటుడిగా చేశారు. విక్రమ్ సినిమాతో నాగార్జున హీరో అయ్యారు. ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు నాగార్జున తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. సంకీర్తన సినిమా డైరెక్టర్ గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు. సంకీర్తన సినిమా గురించి నాగార్జున గురించి చెప్తూ కథని ముందు నేను నాగేశ్వరరావుకి వినిపించాను.
ఈ కథని విన్న నాగేశ్వరరావు చాలా బాగుందని ఈ సినిమాలో మా అబ్బాయి చేస్తారని చెప్పారని.. అలా సంకీర్తన సినిమాలో నాగార్జున ని తీసుకున్నామని జోడి గా రమ్యకృష్ణ నటించారని దర్శకుడు చెప్పారు. నాగార్జున హీరోగా నటించిన విక్రమ్ సినిమా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై గత 23 ఏళ్ల నుండి చిరంజీవి డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఈ విధంగా చిరంజీవి డేట్ దొరకకపోవడం వలన విసుకు వచ్చి ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో విక్రమ్ మూవీని పరిచయం చేశారని చెప్పారు.
Also read:
అంటే చిరంజీవి కోసం చూసి విసుకు చెందినటువంటి నాగేశ్వరరావు చివరికి నాగార్జున ని తన బ్యానర్ లో హీరోగా పరిచయం చేశారని చెప్పారు అని గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఏఎన్ఆర్ వారసుడుగా నాగర్జున తర్వాత నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీకి వచ్చారు ఇద్దరు కూడా మంచి హీరోలుగా పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ అనుకున్నంత గా హిట్లు రాలేదు. చైతు మొన్నామధ్య కస్టడీ సినిమాతో మనం ముందుకి వచ్చారు ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్లో తండేల్ సినిమా వస్తోంది.