Telugu News » Bhaktha kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ‘కన్నప్ప’ 90 రోజుల షెడ్యూల్ పూర్తి..!

Bhaktha kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ‘కన్నప్ప’ 90 రోజుల షెడ్యూల్ పూర్తి..!

కన్నప్ప పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచింది. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఫస్ట్ షెడ్యూల్ ముగిసినట్లు ప్రకటించారు.

by Mano
Bhaktha Kannappa: Manchu Vishnu's dream project.. 'Kannappa' 90 days schedule complete..!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’(Kannappa) సినిమాకు సంబంధించి ఇటీవల షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన కన్నప్ప పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచింది. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఫస్ట్ షెడ్యూల్ ముగిసినట్లు ప్రకటించారు.

Bhaktha Kannappa: Manchu Vishnu's dream project.. 'Kannappa' 90 days schedule complete..!

ఈమేరకు ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టుగా మోహన్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా ట్వీట్ వేశారు. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్లుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం’ అని ప్రకటించారు.

Bhaktha Kannappa: Manchu Vishnu's dream project.. 'Kannappa' 90 days schedule complete..!

న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన 600 మంది ఆర్టిస్టులు, క్నిషియన్లతో ఈ ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశామని పేర్కొన్నారు. అయితే, ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇందులో శివుడి పాత్రలో కనిపిస్తాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ ఆ స్థాయి సినిమాలనే చేస్తున్నాడు. ఇప్పటికే ‘సలార్’ సూపర్ హిట్ కావడంతో భక్త కన్నప్పపై అంచనాలు పెరిగాయి.

మరోవైపు, మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కన్నప్ప’లో ప్రభాస్‌తో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ నటిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దాదాపు 80 శాతం వరకు న్యూజిలాండ్‌‌‌లోనే షూట్ చేయనున్నట్లు తెలిపాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘కన్నప్ప’ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు.

You may also like

Leave a Comment