Telugu News » Chiranjeevi: చిన్ననాటి స్నేహితుడికి చిరంజీవి సాయం.. ఫొటోలు వైరల్!!

Chiranjeevi: చిన్ననాటి స్నేహితుడికి చిరంజీవి సాయం.. ఫొటోలు వైరల్!!

మరోసారి తన మంచిమనసును చాటుకున్నారు మెగాస్టార్. మొగల్తూరు(Mogalthur)కు చెందిన పువ్వాడ రాజా(Puvvada raja) అనే వ్యక్తి చిరంజీవికి బాల్యమిత్రుడు. తన మిత్రుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు.

by Mano

టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) .. సినిమాల్లోనే కాదు.. తన మంచిపనులతో నిజజీవితంలోనూ హీరో అనిపించుంటారు. ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయాన్ని అందించే గొప్ప మనస్తత్వం ఆయనది. తాజాగా మరోసారి తన మంచిమనసును చాటుకున్నారు మెగాస్టార్. అస్వస్థతకు గురైన తన చిన్ననాటి స్నేహితుడికి అండగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

 

మొగల్తూరు(Mogalthur)కు చెందిన పువ్వాడ రాజా(Puvvada raja) అనే వ్యక్తి చిరంజీవికి బాల్యమిత్రుడు. తన మిత్రుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు. రాజాను ఇటీవల తన టీంను పంపించి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఆసుపత్రికి వెళ్లి మరీ రాజా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లను ఆరాతీశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. ‘మీరు గ్రేట్ సర్..’ అని బండ్ల గణేష్ చేసిన ఫ్యాన్స్‌ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  ‘మీది చాలా మంచి మనసు సార్..’ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇటీవల భోళాశంకర్ సినిమాలో నటించారు. ఈ చిత్రం ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం చిరంజీవి మరో సినిమాపై ఫోకస్ చేశారు. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ఠతో ఓ సినిమాకు ఓకే చేశారు. చిరంజీవి కుమార్తె సుస్మిత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.

You may also like

Leave a Comment