ప్రేక్షకులకు నవ్వులు పంచుతారు. కానీ వారి జీవితాల్లోని ఏడుపుని మాత్రం ఎవ్వరికీ కనపడనివ్వరు. వాటికి సైతం నవ్వుల్ని అలవాటు చేసేస్తారు. ఎందుకంటే వారి ఏడుపు కూడా మనకు నవ్వులాగే అనిపిస్తుంది.
చాలా మంది హాస్యనటుల జీవితాల్లో పైకి కనిపించే నవ్వుల్లేవు. అలాంటి విషాదకరమైన పరిస్థితి ప్రస్తుతం శాంతి స్వరూప్ జీవితంలోను కనిపిస్తోంది. జబర్దస్త్(Jabardast)శాంతిగా ప్రేక్షకులకు సుపరిచయం అయిన హాస్య నటుడు శాంతి స్వరూప్(Shanti Swarup) అలియాస్ శాంతి జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ షోలో లేడీ గెటప్‌లో కనిపించి తన అందరికీ నవ్వులు పంచుతుంటారు. అటు జబర్దస్త్ షో చేస్తూనే..ఇటు సోషల్ మీడియాలో సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. అందులో తన లైఫ్ స్టోరీతో పాటు..కాస్ట్యూమ్స్ డిజైన్స్, కామెడీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటుంటారు.
అయితే ఎప్పుడూ నవ్వించిన శాంతి స్వరూప్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. శాంతి స్వరూప్ తన తల్లికి తెలియకుండానే సొంతింటిని అమ్మేస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.అందుకు కారణం తన తల్లికి సర్జరీ చేయాల్సి ఉందని.. ఆసుపత్రి ఖర్చుల(Hospital expenses)కోసం డబ్బులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గత కొద్ది రోజులుగా తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని.. ప్రస్తుతం తనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఆసుపత్రి ఖర్చుల కోసం ఇంటిని అమ్మేస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. అయితే ఇల్లు అమ్ముతున్నట్లు తన తల్లికి తెలియదని విలపించారు. ఈ విషయం తెలిస్తే తాను ఎంతో బాధపడుతుందని అందుకే చెప్పలేదని శాంతి స్వరూప్ తెలిపారు.