స్టార్ హీరోయిన్.. మలయాళీ భామ.. అమలాపాల్ (Amala Paul) రెండో పెళ్లికి సిద్ధమైంది. తన స్నేహితుడు జగత్ దేశాయ్ (Jagat Desai)తో ప్రేమలో ఉన్న అమలపాల్.. పెళ్లి ప్రపోజల్ కు ఓకే చెప్పిందని తెలుస్తుంది.. దీనికి సంబంధించిన వీడియోను కూడా జగత్ సోషల్ మీడియా (Social Media) వేదికగా షేర్ చేశాడు. ఇంతకు ఈ జగత్ ఎవరనే దానిపై నెటిజన్స్‌తో పాటు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అతను ఏం చేస్తాడని తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు..
మరోవైపు గోవాలోని ఓ విల్లా గ్రూప్‌లో జగత్ దేశాయ్ సేల్స్ హెడ్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ సంవత్సరం జూన్ నుంచి జగత్ అమలాపాల్ అతనితో డేటింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా తన రిలేషన్ గురించి అమలపాల్ బయటికి చెప్పలేదు. తాజాగా తన బర్త్‌డే రోజున అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. మరోవైపు కెరీర్ టాప్ గేర్ లో దూసుకుపోతున్న సమయంలో అమలపాల్ తమిళ దర్శకుడు (Director) విజయ్ (Vijay)ని 2014 న వివాహం చేసుకుంది.
అయితే, ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో ఇద్దరూ విడిపోయారు. ఇక మలయాళి ముద్దుగుమ్మ అమలాపాల్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయింది. తమిళ, మలయాళ చిత్రాల్లో సైతం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో చిత్రంతో పాటు ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో అమలాపాల్ నటిస్తోంది.