Telugu News » Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం..!

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం..!

తారక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించాడు. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అభిమానులు, నెటిజన్లు తారక్‌కు అభినందనలు చెబుతున్నారు.

by Mano
Jr NTR: Another rare honor for Jr NTR.. A place in the prestigious list!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో (RRR) కొమురం భీమ్‌ పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తారక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించాడు. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తారక్‌కు అభినందనలు చెబుతున్నారు.

Jr NTR: Another rare honor for Jr NTR.. A place in the prestigious list!

ఈ మేరకు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఎన్టీఆర్‌ పేరును అధికారికంగా ప్రకటించింది. ‘డెడికేషన్  కలిగిన నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. తెరపై తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’ అని అకాడమీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొంది.

జూనియర్ ఎన్టీఆర్ పాటు మరో నలుగురు హాలీవుడ్‌ నటులకు కూడా ఇందులో స్థానం కల్పించింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’లో మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

రెండు భాగాలుగా వస్తున్న దేవర చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి భాగం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా కనిపించనున్నారు.

 

You may also like

Leave a Comment