Telugu News » Lokesh kanagaraj: ‘లియో’ ప్రమోషన్స్‌లో అపశృతి.. డైరెక్టర్‌కు గాయాలు!

Lokesh kanagaraj: ‘లియో’ ప్రమోషన్స్‌లో అపశృతి.. డైరెక్టర్‌కు గాయాలు!

ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ అండ్ మూవీ టీమ్ ఈరోజు కేరళ వెళ్లింది. పాలక్కాడ్‌లోని అరోమా థియేటర్‌కు వచ్చిన దర్శకుడిని చూసేందుకు వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. కేష్‌ను చూసేందుకు జనం ఎగబడడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది.

by Mano
Lokesh Kanagaraj: 'Leo' Promotions Uproar.. Director Injuries!

విజయ్ హీరో(Hero vijay)గా లోకేష్ కనగరాజ్ (Director Lokesh kanagaraj) డైరెక్షన్‌లో తెరకెక్కించిన ‘లియో’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌(Movie promotions)లో అపశృతి చోటుచేసుకుంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది.

Lokesh Kanagaraj: 'Leo' Promotions Uproar.. Director Injuries!

ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ అండ్ మూవీ టీమ్ ఈరోజు కేరళ వెళ్లింది. పాలక్కాడ్‌లోని అరోమా థియేటర్‌కు వచ్చిన దర్శకుడిని చూసేందుకు వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. సినిమాను మలయాళంలో రిలీజ్ చేసిన గోకులం మూవీస్ సంస్థ పూర్తి భద్రతా వ్యవస్థలను సిద్ధం చేసినప్పటికీ థియేటర్‌లో లోకేష్‌ను చూసేందుకు జనం ఎగబడడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది.

ఈ తొక్కిసలాటలో లోకేష్ కనగరాజ్ కాలికి గాయమైనట్లు ట్విట్టర్ (x) వేదికగా వెల్లడించారు. దీంతో ప్రమోషన్స్ అర్ధాంతరంగా నిలిపివేసి చెన్నైకి తిరిగి వెళ్ళిపోయాడు. కేరళలో ఇతర ప్రచార కార్యక్రమాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ జరగాల్సిన త్రిస్సూర్ రాగం థియేటర్, కొచ్చి కవితా థియేటర్ ఈవెంట్లు రద్దు చేయబడ్డాయి. కొచ్చిలో జరగాల్సిన ప్రెస్‌మీట్‌ను మరో రోజు నిర్వహించనున్నట్లు లోకేష్ సోషల్ తెలిపారు. ఈరోజు కూడా సెలవు కావడంతో హౌస్‌ఫుల్ షోలతో లియో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది.

అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన లియోలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిష్కిన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్, శాండీ, జనని, అభిరామి వెంకటాచలం, బాబు ఆంటోని ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్‌లో డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ళ విషయంలో మాత్రం సినిమా దూసుకుపోతోంది.

 

You may also like

Leave a Comment