Telugu News » Love letter from jail: తీహార్ జైలు నుంచి హీరోయిన్‌కు లవ్ లెటర్!

Love letter from jail: తీహార్ జైలు నుంచి హీరోయిన్‌కు లవ్ లెటర్!

 ఓవైపు మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి హడావుడి ఉంటే.. మధ్య మధ్యలో సుఖేష్ ప్రేమ లేఖలు రాయడం చర్చనీయాంశమవుతోంది. ఇది వరకు కూడా ఫెర్నాండెజ్‌ను చాలా మిస్ అవుతున్నా అంటూ సుఖేష్ చంద్రశేఖర్ ఘాటు ప్రేమ లేఖను రాశాడు.

by Mano
Love letter to heroine Jacqueline from Tihar Jail!

మనీలాండరింగ్(money laundering) కేసులో అరెస్టయిన సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrashekar) తీహార్ జైలు నుంచి నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(jacqueline fernandez)కు మరోసారి ఘాటు ప్రేమ లేఖ రాశాడు.

Love letter to heroine Jacqueline from Tihar Jail!

ఆ లేఖలో ‘నిజం త్వరలోనే బయటకు వస్తుంది. మనమిద్దం ఒక్కటవుతాం. జీవితాంతం కలిసే జీవిస్తాం మై బేబీ గర్ల్. ఏ జైలు నిన్ను ప్రేమించడాన్ని ఆపలేవు. నా కోసం వైష్ణోదేవి, మహా కాళేశ్వర ఆలయంలో స్పెషల్ పూజ హారతి కార్యక్రమంలో పాల్గొను’ అని పేర్కొన్నాడు. సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. 200 కోట్ల దోపిడీ కేసులో జైలుకు వెళ్లాడు.

ఓవైపు ఈ కేసుకు సంబంధించి హడావుడి ఉంటే.. మధ్య మధ్యలో సుఖేష్ ప్రేమ లేఖలు రాయడం చర్చనీయాంశమవుతోంది. ఇది వరకు కూడా ఫెర్నాండెజ్‌ను చాలా మిస్ అవుతున్నా అంటూ సుఖేష్ చంద్రశేఖర్ ఘాటు ప్రేమ లేఖను రాశాడు. అందులో ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్‌లో ఫెర్నాండెజ్‌ను చూసి మరోసారి ప్రేమలో పడ్డానని పేర్కొన్నాడు.

You may also like

Leave a Comment