Telugu News » Marriage in theater: ‘లియో’ సాక్షిగా.. సినిమా హాల్‌లోనే పెళ్లి చేసుకున్న జంట..!

Marriage in theater: ‘లియో’ సాక్షిగా.. సినిమా హాల్‌లోనే పెళ్లి చేసుకున్న జంట..!

హీరోను అభిమానించే జంట మాత్రం ఏకంగా థియేటర్‌లోనే పెళ్లి చేసుకుంది. థియేటర్లలోనే రింగులు, దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

by Mano

అభిమాన హీరో(favorite hero) సినిమా విడుదలవుతుందంటే ఫ్యాన్స్‌(fans) చేసే రచ్చ అంతా ఇంతా ఉండదు. థియేటర్ దద్దరిల్లేలా హంగామా సృష్టిస్తారు. పెద్దపెద్ద కటౌట్లు(big cutouts) కట్టి పూలదండలు వేసి పాలాభిషేకాలు చేసి సందడి చేస్తారు. తీన్మార్ డప్పులకు స్టెప్పులేస్తూ ఇక ఆ రోజంతా ఒక పండుగలా జరుపుకుంటారు.

Marriage in theatre: 'Leo' as a witness.. a couple got married in the cinema hall..!

అయితే ఓ హీరోను అభిమానించే జంట మాత్రం ఏకంగా థియేటర్‌లోనే పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. లోకేశ్ కనగ రాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, హీరోయిన్ త్రిష నటించిన ‘లియో’ ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన సంగతి తెలిసిందే.

తమిళనాడులోని పుడుక్కోటి జిల్లాకు చెందిన వెంకటేశ్, మంజుల సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లారు. అయితే వారు థియేటర్‌కు వచ్చింది మామూలుగా కాదు.. పెళ్లి దుస్తుల్లో. దళపతి విజయ్‌కు వీరాభిమానులైన ఆ జంటకు గతంలోనే నిశ్చతార్థం అయింది. అయితే లియో సినిమా విడుదలయ్యాక పెళ్లి చేసుకోవాలని భావించారు.

అక్టోబర్ 19న సినిమా విడుదల కానుండడంతో 20న పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. థియేటర్‌కు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వెంకటేశ్, మంజుల.. సినిమాను వీక్షించి.. థియేటర్లలోనే రింగులు, దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

 

You may also like

Leave a Comment