Telugu News » Mega family: తెలుగింటి ఆడపడుచులా పవన్‌ భార్య.. మెగా ఫ్యామిలీ ఫొటోలు వైరల్..!

Mega family: తెలుగింటి ఆడపడుచులా పవన్‌ భార్య.. మెగా ఫ్యామిలీ ఫొటోలు వైరల్..!

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కుమారుడు వరుణ్ తేజ్ (VarunTej), నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi)తో వివాహం ఇటలీలో సోమవారం వైభవంగా జరిగింది.పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా అయితే అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరలో ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.

by Mano
Mega family: Pawan's wife is like a Telugu woman.. Mega family photos are viral..!

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కుమారుడు వరుణ్ తేజ్ (VarunTej), నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi)తో వివాహం ఇటలీలో సోమవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మెగా కుటుంబ సభ్యులు (MegaFamily) అందరూ ఆ పెళ్ళికి హాజరై అక్కడ కలుసుకున్నారు. ఇదే సందర్భంలో మెగా బ్రదర్స్, అక్క చెల్లెల్లు అందరూ ఒక గ్రూపులో వున్న ఫోటో ఒకటి సోషల్ మీడియా సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతోంది.

Mega family: Pawan's wife is like a Telugu woman.. Mega family photos are viral..!

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా వెడ్డింగ్‌లో చిరంజీవి అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు అందరూ కలిపి ఒక గ్రూప్ ఫోటోకి పోజు ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)–సురేఖ, నాగబాబు-పద్మజ, పవన్ కళ్యాణ్ (PawanKalyan)-అన్నా లెజెనోవా (AnnaLezhneva), అలాగే వారి సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి వారి భర్తలతో వున్న గ్రూపు ఫోటో వైరల్ అవుతోంది. ఇది రేర్ ఫోటో అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా అయితే అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరలో ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ వివాహం గురించి చాలామంది ఏదేదో మాట్లాడారు, అవన్నీ పటాపంచలు చేయడానికి ఈ ఒక్క ఫొటో చాలు అని అభిమానులు అంటున్నారు.

Mega family: Pawan's wife is like a Telugu woman.. Mega family photos are viral..!

You may also like

Leave a Comment