Telugu News » Pragathi: అలా రాయడం బాధ్యతా రాహిత్యం.. రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి ఫైర్..!

Pragathi: అలా రాయడం బాధ్యతా రాహిత్యం.. రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి ఫైర్..!

ఓ స్టార్ ప్రొడ్యూసర్‌ను ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ఈ మధ్య వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ప్రగతి స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు.

by Mano
Pragathi: It is irresponsible to write like that.. Actress Pragathi fires on the news of her second marriage..!

ప్రముఖ నటి ప్రగతి(Actress Pragathi) సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తనపై వచ్చే రూమర్స్‌ను కొట్టిపారేస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్‌ను ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ఈ మధ్య వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ప్రగతి స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు.

Pragathi: It is irresponsible to write like that.. Actress Pragathi fires on the news of her second marriage..!

ప్రగతి ఏమన్నారంటే.. ‘నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రముఖ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడిన విషయం. మీరు ఒక సంస్థను నడుపుతున్నారు.. అందులో ఎంతోమంది చదువుకున్నవాళ్లు ఉంటారు. మంచి కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉంటారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక న్యూస్‌ను ప్రచారం చేశారు. నేను కేవలం ఒక నటిని మాత్రమే కావొచ్చు… మీరేం రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? నేను దీన్ని ఖండిస్తున్నాను.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అదేవిధంగా ‘నా వ్యక్తిగత జీవితంపై రాసే హక్కు మీకెక్కడిది? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇష్టం వచ్చినట్లు రాయడం బాధాకరం. ఆధారాలు ఉన్నప్పుడు రాస్తే ఫర్వాలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాయడమేంటని ఆ ప్రముఖ మీడియా సంస్థపై ఫైర్ అయింది. ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే రాయండి. జర్నలిస్టు విలువలు అనేవి ఉంటే వాటిని పాటించండి. నాపై వార్త రాయడం మాత్రం కచ్చితంగా అనైతికం” అంటూ ప్రగతి తీవ్రస్థాయిలో మండిపడింది.

ప్రస్తుతం ప్రగతి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో ప్రగతి నటిస్తోంది. తల్లి, వదిన వంటి పాత్రలతో ఈ మధ్య కాలంలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగులో ఈ నటి 100కు పైగా చిత్రాలు చేసి ఆమె ఇటీవల ‘భోళాశంకర్’ సినిమాలో కనిపించింది.

 

You may also like

Leave a Comment