Telugu News » Ram Charan – Upasana: ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై మెగా జంట..!

Ram Charan – Upasana: ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై మెగా జంట..!

టాలీవుడ్ ఫస్ట్ కపుల్(Tollywood First Couple)గా రికార్డు సొంతం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంట దర్శనమిచ్చారు.

by Mano
Ram Charan – Upasana: Mega couple on cover page of popular magazine..!

టాలీవుడ్ మెగా హీరో రామ్ చ‌రణ్, ఉపాసన(Ram Charan – Upasana) దంపతులు మరో అరుదైన ఘనత సాధించారు. టాలీవుడ్ ఫస్ట్ కపుల్(Tollywood First Couple)గా రికార్డు సొంతం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంట దర్శనమిచ్చారు.

Ram Charan – Upasana: Mega couple on cover page of popular magazine..!

అయితే ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఇప్పటి వరకు ఎవరికీ చోటుదక్కలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొదటిసారి అరుదైన గౌరవాన్ని అందుకోవడంతో చరణ్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంట‌ర్వ్యూలో భాగంగా ఈ ఫొటో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోర్బ్స్ సంస్థ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. ‘‘సూపర్ కపుల్..’’ అంటూ కవర్ పేజీపై క్యాప్ష‌న్ ఇచ్చారు.

ఈ ఫొటోలో పింక్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో చరణ్, ఉపాసన చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఉపాసనల‌ ల‌వ్ స్టోరీ, వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు. క్లింకార వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వ‌చ్చాయి అనేది ఈ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది ఈ మెగా జంట.

You may also like

Leave a Comment