నేషనల్ క్రష్(National Crush) రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా(PAN Inda)రేంజ్‌లో సినిమా చేస్తూ బిజీగా అయిపోయింది. పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలను చేస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో రష్మిక ఆసక్తికర పోస్ట్ చేసింది.
ఆ పోస్ట్‌లో ప్రస్తుతం తను ట్రావెలింగ్ చాలా మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చింది రష్మిక. రోజూవారి పనులతో ఎప్పుడూ ఉండేవని.. అప్పుడప్పుడు వెకేషన్ ప్లాన్ చేసుకోవాలని చెబుతోంది. సినిమాల్లో బిజీబిజీగా ఉంటున్న తనకు వెకేషన్‌కు వెళ్లే సమయం లేకపోవడంతో నిరాశ పడుతున్నట్లు తెలిపింది. ప్రయాణంలో పొందే అనుభూతిని మిస్ అవుతున్నా అంటూ రష్మిక ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
‘నేను ప్రయాణాన్ని చాలా మిస్ అవుతున్నాను. ప్రయాణం చేసే అబ్బాయిల గురించి ఒక చిన్న విషయం. ఎప్పుడైనా మీకు కొంత సమయం దొరికితే ప్రయాణం నిర్ధారించుకోండి. ఎక్కడికైనా, ఇలా.. మీ స్వస్థలానికి లేదా మీ స్నేహితుల ఇళ్లకు లేదా మీ కలల గమ్యస్థానానికి లేదా కుటుంబంతో లేదా ఒంటరిగా కానీ వెళ్లండి.. సురక్షితంగా అంటూ తెలిపింది. ‘ప్రయాణం మీ జ్ఞానాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.. ఈ ట్రావెల్‌లో ప్రతీది గొప్ప అనుభూతి చాలా మిస్ అవుతున్నాను’ అంటూ రష్మిక అంటూ రాసుకొచ్చింది.. అదే పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న పుష్ప-2లో నటిస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సెకండ్ పార్ట్ ఈ చిత్రం. చాలా రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో మరో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా గురించి అధికార ప్రకటన ఇంకా రాలేదు.