Telugu News » Rashmika Mandanna: ఆ సినిమా నా ఆకలి తీర్చింది: నేషనల్ క్రష్

Rashmika Mandanna: ఆ సినిమా నా ఆకలి తీర్చింది: నేషనల్ క్రష్

నేషనల్ క్రష్‌(National Crush) రష్మిక మందన్నా(Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో ‘యానిమల్’ సినిమాపైనే చర్చ నడుస్తోంది. అందులో రష్మిక నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

by Mano
Rashmika Mandanna: That movie whetted my appetite: National Crush

నేషనల్ క్రష్‌(National Crush) రష్మిక మందన్నా(Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. టాలీవుడ్‌లో పుష్ప-2 సినిమాతో ఈ బ్యూటీ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పాకింది. ఆ సినిమా నుంచి వరుస విజయాలతో దుసుకుపోతోంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ బాట పట్టింది. ఆమె నటించిన ‘యానిమల్‌'(Animal) సినిమా సంచలనం క్రియేట్ చేస్తోంది.

Rashmika Mandanna: That movie whetted my appetite: National Crush

సినీ ఇండస్ట్రీలో ‘యానిమల్’ సినిమాపైనే చర్చ నడుస్తోంది. అందులో రష్మిక నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకూ గ్లామర్‌ డాల్‌గా మాత్రమే అలరించిన నేషనల్‌ క్రష్‌ తొలిసారి అభినయతారగా కూడా అలరించిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇటీవల రష్మిక మాట్లాడుతూ ‘అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను. కథ నచ్చాలి. పాత్ర నచ్చాలి. పనిచేసే వ్యక్తులు నచ్చాలి. ఆ తర్వాతే రెమ్యునరేషన్‌. నా అదృష్టం బావుంది. మంచి సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘యానిమల్‌’ సినిమా ఇచ్చిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నటిగా నా ఆకలి తీర్చిన సినిమా అది’ అని చెప్పుకొచ్చింది రష్మిక.

ఇక రష్మిక నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ‘పుష్ప-2’ షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతున్నది. అందులో ‘శ్రీవల్లి’గా మరోసారి మురిపించనున్నది రష్మిక. మరోవైపు గీతా ఆర్ట్స్‌ నిర్మిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ఉండనే ఉంది. త్వరలో మరో సినిమా ఎనౌన్స్‌మెంట్‌ కూడా రానుంది.

You may also like

Leave a Comment