బుల్లితెర నటి రీతూ చౌదరి(Rithu Chowdary) ఓ వీడియోలో తాను ఎదుర్కొన్న సమస్యలను తెలుపుతూ ఎమోషనల్ అయింది. ఓ వ్యక్తిని నమ్మి మోసపోయానని ఆరోపించింది. ఆర్థికంగా ఇబ్బందులు పడడమే కాకుండా మానసికంగా కుంగిపోయానని వాపోయింది. రీతూ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్(Viral) అవుతోంది.
రీతూ ఆ వీడియోలో ఏమందంటే.. “కొంతకాలం క్రితం నేనొక ఇంటిని తీసుకున్నా. దాదాపు ఆరు నెలల క్రితం ఆ ఇంటి వీడియోను మీ అందరితో పంచుకున్నా. ఆనాటి నుంచి ఇప్పటికీ ఇంటీరియర్ వర్క్ జరుగుతూనే ఉంది. మధ్యలో చాలా సమస్యలు రావడం వల్ల పని ఆలస్యమైంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే నాన్న చనిపోవడం వల్ల నేను ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా. ముఖ్యంగా ఈ ఇంటి విషయంలో ఈ ఇల్లు కొన్నాక నేను తీవ్ర మానసిక కుంగుబాటుకు లోనయ్యా. ఆర్థికంగా మోసపోయా. డబ్బులు పోగొట్టుకున్నా. కన్నీళ్లు పెట్టుకున్నా” అంటూ రీతూ తెలిపింది.
ఓ వ్యక్తికి ఇంటీరియల్ వర్క్‌కు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని పని అప్పగిస్తే ఇష్టం వచ్చినట్లు సగం సగం పనులు చేశాడంటూ ఆరోపించింది రీతూ. దాంతో అతడిని పనిలో నుంచి తీసేసి.. డబ్బులు తిరిగి ఇవ్వమన్నానని, ఫోన్లు చేస్తే స్పందించేవాడు కాదని తెలిపింది. ఓవైపు బ్యాంక్ ఈఎంఐలు కట్టుకుంటూ మరోవైపు ఇంటి పని పూర్తి కాక మానసికంగా ఎంతో సతమతమైనట్లు తెలిపింది. చివరకు పోలీసుల ప్రమేయంతో కొంత డబ్బు తిరిగి వచ్చిందని, ఇంటీరియల్ వర్క్‌ను ఇప్పుడు వేరే వారికి ఇచ్చానని చెప్పింది. తనకు ఎదురైన ఇబ్బంది మరెవరికీ రాకూడదనే ఈ వీడియోను షేర్ చేస్తున్నట్లు తెలిపింది.
రీతూ చౌదరి జబర్దస్త్ షోతో పాపులారిటీ సంపాదించింది. జబర్దస్త్ టీమ్ లీడర్ హైపర్ ఆది టీమ్‌లో కనిపిస్తూ కామెడీకి గ్లామర్ జోడించింది రీతు. ఆ తర్వాత శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో కూడా మెరిసింది. అందులో అప్పుడప్పుడు సూపర్ హిట్ పాటలకు చిందులేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదట ‘గోరింటాకు’ అనే సీరియల్లో నటించిన ఆమె ప్రస్తుతం కొన్ని సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ, తన గ్లామర్ ఫొటోషూట్లనూ పోస్ట్ చేస్తుంటుంది ఈ అమ్మడు.