స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలై క్లాష్ ఏర్పడిన సందర్భాలు అనేకం. తాజాగా, పాన్ ఇండియా హీరో ప్రభాస్(Prabhas) నటించిన ‘సలార్’(Salaar)తో పాటు బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్(Sharukh Khan) నటించిన ‘డంకీ’(Dunki) ఒకే సమయంలో విడుదలయ్యాయి. అయితే, ఇందులో సలార్ శుక్రవారం(డిసెంబర్22)న, డంకీ ఒక రోజు ముందు అంటే గురువారం(డిసెంబర్ 21)న విడుదలయ్యాయి.
ఈ సినిమాల విడుదల నుంచే కలెక్షన్ల(Collections) విషయంలో పెద్ద క్లాష్ వస్తుందని సినీవర్గాలు అంచనా వేశాయి. అనుకున్నట్లుగానే ఒక్కరోజు వ్యవధిలో విడుదలైన ఈ రెండు సినిమాల్లో డైనోసార్ ప్రభాస్ వార్ వన్‌సైడ్ చేసేశాడు. సలార్ సీజ్ ఫైర్ సినిమాతో షారుఖ్‌ను ఓవర్ షాడో చేసేసాడు ప్రభాస్. అయితే ఇది చిన్నవిషయం కాదనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరోలతో కాని పని డైనోసార్ చేశాడు. ఖాన్ సామ్రాజ్యంలో పాగా వేశాడు.
డంకీ సినిమా రిలీజ్‌కు ముందు నార్త్‌లో సలార్ సినిమా విడుదలకు మల్టీప్లెక్స్‌తోపాటు సింగల్ స్క్రీన్స్ ఇవ్వలేదు. అయితే సలార్ విడుదలయ్యాక సీన్ తారుమారైంది. థియేటర్స్ దొరకని దగ్గర నుంచి డంకీ సినిమాని తీసేసి సలార్ కి కేటాయించే వరకూ తెచ్చాడు ప్రభాస్. డంకీ ఫస్ట్ డే కలెక్షన్లు రూ.60కోట్లు కాగా సలార్ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టి రూ.175కోట్ల వసూళ్లను రాబట్టింది. షారుఖ్ డంకీ సినిమా కలెక్షన్లకు ఇది మూడింతలు.
అంతేకాదు.. నార్త్‌లో డంకీ సినిమాకి కేవలం 16శాతమే ఆక్యుపెన్సీ వచ్చింది. సోమవారం నాటికి నార్త్‌లో దాదాపు అన్ని సెంటర్లలో డంకీ సినిమాను సలార్ రీప్లేస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరి పోసిన షారుఖ్‌కు ఈసారి కలిసిరాలేదు. ప్రభాస్ యునానిమస్‌గా ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా నిలిచాడు.