Telugu News » Superb Sam : ఆ వ్యాధికి నేనే మేస్తిరి..!

Superb Sam : ఆ వ్యాధికి నేనే మేస్తిరి..!

కొంత మంది తమకు వచ్చిన కష్టాన్ని పగవాళ్లకు కూడా రాకూడదు అనుకుంటారు. చాలా కొద్దిమంది మాత్రమే మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తారు.

by sai krishna

కొంత మంది తమకు వచ్చిన కష్టాన్ని పగవాళ్లకు కూడా రాకూడదు అనుకుంటారు. చాలా కొద్దిమంది మాత్రమే మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తారు.అలాంటి వారిలో సమంత ఒకరు.పరిచయం అక్కర్లేని వ్యక్తిగా దక్షిణాది సినిమాల్లో స్టార్ డమ్(Star Dum)క్రియేట్ చేసుకున్నారు.


తనకు తానే సారధిగా మారి సాగిపోతున్న తన జీవితంలో అనుకోని పిడుగు పాటు. అరుదైన మయోసైటిస్(Myositis)వ్యాధికి గురైంది.ఆ కారణంగానే సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది.అందులో భాగంగానే ఇది వరకు ఒప్పుకున్న(యశోద, శాకుంతలం) సినిమాలను కంప్లీట్ చేసింది.


ప్రస్తుతం విజయ్ దేవరకొండతో జరుగుతున్న ‘ఖుషీ’ షెడ్యూల్ సైతం పూర్తిచేసింది. ఇటీవల రీఫ్రెష్ మెంట్ కోసం స్నేహితులతో కలిసి బాలీ(Bali) ట్రిప్కు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చి ఖుషి సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు.

తన ప్రమోషన్స్ ముగించుకున్నాక సామ్ ప్రస్తుతం ఈ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు ఆమె అక్కడే ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు తాజాగా మయోసైటిస్ ఇండియా ఆర్గనైజేషన్(Myositis India Organization)సమంతను మయోసైటిస్ అంబాసిడర్‌గా ప్రకటించారు.


ఈ వ్యాధి పట్ల అవగాహన పెంపొందిస్తూ, వ్యాధితో పోరాడుతున్న వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నియామకం జరిగినట్లు వారు తెలిపారు. ఇక ఈ విషయాన్ని సమంత తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశారు. అభిమానులు సామ్ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment