భారత దేశంలో భావ స్వాతంత్య్ర హక్కు ఉంది. ఎవరి భావాలు వారు భారీగా వ్యక్త పరచవచ్చు. అయితే తద్వారా వచ్చే పర్యవసానాలు కూడా బేరీజు వేసుకుని తమ భావాలని వ్యక్త పరచాల్సి ఉంటుంది.
లేకపోతే ఆ మేరకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని కొట్టిపడేసిన అంతరాత్మ అంత తేలిగ్గా అవతలి వాళ్ల విమర్శలను తీసుకోలేదు. చంద్రయాన్-3(Chandrayaan-3)పై సెటైరిక్ పోస్టు పెట్టిన ప్రకాష్ రాజ్‌పై నెటిజన్లు ట్రోలింగ్ ఆపడం లేదు.
మోడీపై అక్కసును దేశంపై చూపుతారా అంటూ నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై ఓరేంజ్ లో ఫైర్ అవుతున్నారు. వివాదంపై ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చినా ట్రోలింగ్ తగ్గడం లేదు.
చంద్రయాన్ – 3 సక్సెస్ కావడంతో ప్రకాష్ రాజ్ ను నెటిజన్లు మరింత టార్గెట్ చేశారు. ప్రకాష్ ను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.
‘అరెస్ట్ ప్రకాష్ రాజ్(Arrest Prakash Raj)’ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతుంది. ప్రకాష్ రాజ్‌పై వీడియోలు, మీమ్స్ తో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు.