అనంత్ అంబానీ(Anant Ambani), రాధికా మార్చంట్(Radhika Marchant)ల ప్రీవెడ్డింగ్ వేడుకలకు చాలామంది సెలిబ్రెటీలు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు ఉన్నారు. ఈ ఈవెంట్లో రామ్‌చరణ్‌తో కలిసి నాటునాటు పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ డాన్స్ సమయంలోనే షారుఖ్ ఖాన్(Shah Rukh khan), రామ్ చరణ్((Ramcharan)ను వేదిక మీదకి పిలిచి.. నాటు నాటు స్టెప్‌ను ఖాన్స్‌తో కలిసి చెర్రీ స్టెప్పులేశాడు. అయితే, రామ్ చరణ్‌ను పిలిచేటప్పుడు షారుఖ్.. ‘ఇడ్లీ వడ’ రామ్ చరణ్ అని పిలిచాడు. ఈ విషయం ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ తన ఇన్‌స్టా స్టోరీలో తెలపడంతో అందరూ షాక్ అయ్యారు.
షారుఖ్ అలా అనడంపై టాలీవుడ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ అభిమానులు చరణ్‌ను అవమానించాడని ప్రచారం చేశారు. చరణ్‌కు షారుఖ్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రచారంపై తాజాగా షారుఖ్ స్పందించాడు. రామ్ చరణ్‌ను అవమానించలేదని తెలిపారు. అంతేకాదు.. తన మూవీలోని ఓ సినిమా డైలాగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.
అయితే సౌత్ ఆడియన్స్‌కు ఆ డైలాగ్ గురించి తెలియకపోవడంతో.. చరణ్‌ని అవమానించారని భావించి తెగ ఫీల్ అయ్యిపోయారు. బాలీవుడ్ హీరోల్ని వడాపావ్, భేల్ పూరి అని పిలిస్తే ఊరుకుంటారా? అని ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు. ఏదేమైనా ఫన్నీగా అయినా సరే చరణ్‌ను అలా పిలవడంపై ఫ్యాన్స్‌కు నచ్చలేదు. టాలీవుడ్ హీరోల స్థాయి పెరుగుతుండటంతో తట్టుకోలేక ఇలా పిలిచి ఉంటాడని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
OMG Ram Charan Sir have To Much Negativity in Tollywood
Half Tollywood clowns couldn’t understand what is the difference between love & friendship between SRK sir & Ram Charan sir.🩵
SRK Represent This Movie Dailoge To Mass Man @AlwaysRamCharan .#RamCharan #Sharukhan pic.twitter.com/I8yZvBwS2D
— Ruban Salaar ™ 🔥🦁 (@Harshitha61) March 4, 2024